ఊట్కూర్, అక్టోబర్ 7 : ప్రజల భాగస్వామ్యం ఉంటేనే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బిజ్వారం లో శుక్రవారం పశువుల సంతను ఎమ్మెల్యే ప్రారంభించా రు. సర్పంచ్ సావిత్రమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు, వ్యాపారులనుద్దేశించి ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రభుత్వం ఎంతో విశిష్టాత్మక కార్యక్రమా లు చేపట్టినా ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డు, శానిటేషన్, వీధి లైట్లు, సంత బజార్, పల్లె దవాఖాన ఏర్పా టు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సంతృప్తినిచ్చిందన్నారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేశారన్నా రు. గ్రామాల్లో పశు సంపద నానాటికి అంతరించి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిలో పాడి, పశువుల పెంపకం అత్యవసరమని రైతులు పశు సంపదపై దృష్టి సా రించాలని సూచించారు. అలాగే రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని అలవాటు చే సుకోవాలని కోరారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమన్నారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి ప థంలోకి తేవాలని, అందుకు తమ సహకారం నిరంతరం ఉంటుందని ఆయన తెలిపారు.
వివిధ గ్రామాల నుంచి వ చ్చిన వ్యాపారుల సాదక బాదకాలను తెలుకున్నారు. వ్యా పారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి పొందాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీ ఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఎల్లాగౌడ్, ఎంపీటీసీ హన్మమ్మ, కార్యదర్శి మంజుల, ఉపసర్పంచ్ నర్సింహులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్మారెడ్డి, మాజీ జె డ్పీటీసీ అరవింద్‌కుమార్, కృష్ణ, సలీం, గోవర్ధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.