కృష్ణ, సెప్టెంబర్ 22 : ఆసరా పథకం లబ్ధిదారులకు సీ ఎం కేసీర్ భరోసా కలిగిస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. మండలంతోపాటు చేగుంట, ఐ నాపూర్ ఆలంపల్లి, కున్సీ తదితర గ్రామాల్లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ ప్రొసీడింగ్‌లను, గుర్తింపుకార్డులతోపాటు కల్యాణలక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలను మం డలంలోని రైతు వేదికలో సర్పంచులతో ఎమ్మెల్యే కలిసి గు రువారం పంపిణీ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేను స ర్పంచులు పూలమాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు అందిస్తామని, అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అబద్ధ్దాలు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయ త్నం చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచుల సం ఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివప్ప, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి మోనేశ్, రైతుబంధు సమితి ఉమ్మడి మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీలు, వార్డు సభ్యు లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 22 : ప్రతి ఏటా ఆడబిడ్డలకు సర్కార్ కానుకగా చీరలను అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఉప్పర్‌పల్లి, లింగంపల్లి గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే ఆ డపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర పండు గ అయినటువంటి దసరా పండుగకు ప్రభుత్వం తరఫున మహిళలకు చీరలు అందించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి కార్యకర్త శ్రేయస్సే పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఉప్పర్‌పల్లి స్టేజీ వద్ద పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండావిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఉద్య మ స్ఫూర్తితో ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఏండ్ల పోరాటం సాగించి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసుకోవ డం జరిగిందని తెలిపారు. అదే స్ఫూర్తితో నేడు రాష్ట్రంలో పార్టీ తప్ప ఇతర పార్టీలకు చోటు లేకపోయిందన్నారు. కా ర్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, ఎంపీడీవో శ్రీధర్, ఏపీ ఎం నారాయణ, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఉప్పర్‌పల్లి సర్పంచ్ శ్రావణి, లింగంపల్లి సర్పంచ్ సుజాత, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ, సెప్టెంబర్ 22 : మండలంలోని కంసాన్పల్లి, యంనోన్పల్లి, గున్ముక్ల, మంత్రోన్పల్లి తదితర గ్రామాల్లో గురువారం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ 18 ఏండ్లు పైబడిన మహిళలందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సద్గుణ, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరికల్, సెప్టెంబర్ 22 : అన్నివర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోపాటు ఇబ్రహీంపట్నం, పల్లెగడ్డ, మాధ్వార్, పెద్దచింతకుంట, తీలేరు, వెంకటపూర్, రాకొండ, పుసల్పాడ్ తదితర గ్రామాల్లో గురువారం మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాల్లో భాగంగా మహిళలకు చీరలను అందిజేస్తున్నదన్నారు. ప్రభుత్వం అన్నివర్గాల ప్ర జలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు. అలాగే పింఛన్‌దారులకు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీ లు, వైస్ ఎంపీపీ రవికుమార్ యాదవ్, తీలేరు సింగిల్విం డో చైర్మన్ రాజేందర్‌గౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు మతీ న్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, ఎంపీడీవో యశోదమ్మ, ఏపీవో వనజ, ఎంపీవో బాలాజీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 22 : మండలంలోని శాసన్‌పల్లి, పేరపళ్ల, ఎక్లాస్పూర్, భైరంకొండ, అప్పిరెడ్డిపల్లి, అప్పక్‌పల్లి, మీదితండా తదితర గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమాలకు ఎంపీ పీ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, పీఏసీసీఎస్ చైర్మన్ న ర్సింహారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు హాజరై సర్పంచులతో కలిసి బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. అలాగే ఆసరా పింఛన్ల ప్రొ సీడింగ్‌లు, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీవో రాజు, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.