Supplements | విటమిన్ లేదా మినరల్ ట్యాబ్లెట్లను వాడుతున్నారా..? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!
సాధారణంగా మనం అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యుడిని సంప్రదించి వారు సూచించిన ప్రకారం మందులను, సప్లిమెంట్స్ ను వాడుతూ ఉంటాం. కానీ నేటి కాలంలో చాలా మంది ప్రజలు ఎటువంటి సూచనలు, ప్రిస్క్రిప్షన్ వంటివి లేకుండానే మందులను తీసుకుంటున్నారు.
Supplements | సాధారణంగా మనం అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యుడిని సంప్రదించి వారు సూచించిన ప్రకారం మందులను, సప్లిమెంట్స్ ను వాడుతూ ఉంటాం. కానీ నేటి కాలంలో చాలా మంది ప్రజలు ఎటువంటి సూచనలు, ప్రిస్క్రిప్షన్ వంటివి లేకుండానే మందులను తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మనకు అనేక దుష్ప్రభావాలు కలిగే అవకాశం కూడా ఉంది. మనకు మనమే రోగాన్ని నిర్దారణ చేసుకుని మందులు వేసుకోవడం వల్ల మందుల మోతాదు పెరిగిపోవడమే కాకుండా అవి ఇతర మందులతో కలిసి అనారోగ్యానికి దారి తీసే అవకాశం ఉంది. కనుక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మందులు వాడే ముందు వాటి మోతాదును, ప్రభావాలను తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.
వీటిని రోజూ తీసుకోవాలి..
అనారోగ్యాన్ని తగ్గించడంలో మందులను తీసుకునే మోతాదు, సమయం ప్రభావం ఎంతో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. భోజనం తరువాత తీసుకోవడం వల్ల కొన్ని మందుల శోషణ పెరుగుతుంది. అలాగే కొన్ని మందులను మనం క్రమం తప్పకుండా రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మందులను తగిన సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుందని ఇవన్నీ తెలియకుండా మనం మందులను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గకపోగా కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు విటమిన్లకు సంబంధించిన సప్లిమెంట్స్ ను తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని నీటిలో కరిగే, కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. విటమిస్ సి తో పాటు బి విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు. కనుక ఇవి మూత్రం ద్వారా రోజూ విసర్జించబడతాయి. కనుక నీటిలో కరిగే విటమిన్లను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ఏ సమయంలో అయినా సరే.. కానీ..?
చాలా వరకు విటమిన్లను రోజులో ఏ సమయంలోనైనా, ఆహారంతో లేదా ఆహారం లేకుండా తీసుకోవచ్చు. అయితే ఆస్కార్బిక్ ఆమ్లాన్ని ఆహారంతో తీసుకోవడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా చాలా మంది ఐరన్ సప్లిమెంట్స్ ను తీసుకుంటూ ఉంటారు. ఖాళీ కడుపుతో ఐరన్ సప్లిమెంట్స్ ను తీసుకోవచ్చు. అయితే ఇది కొందరిలో కడుపు నొప్పిని కలిగిస్తుంది. అలాంటి సమయంలో ఏదైనా తిన్న తరువాత తీసుకోవాలి. అయితే క్యాల్షియం ఎక్కువగా ఉండే పాలు వంటి ఆహారాలను తీసుకున్న తరువాత ఐరన్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల శరీరం ఐరన్‌ను ఎక్కువగా గ్రహించదు. మెగ్నీషియం సప్లిమెంట్స్ ను కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు. వీటిని ఎక్కువగా రాత్రిపూట తీసుకుంటారు. కొందరు నిద్ర నాణ్యతను పెంచుకోవడానికి రాత్రిపూట మెగ్నిషియం సప్లిమెంట్స్ ను తీసుకుంటారు.
అన్నీ ఒకేసారి వద్దు..
అయితే ఒకేసారి క్యాల్షియం, జింక్, మెగ్నీషియం సప్లిమెంట్స్ ను కలిపి తీసుకోకూడదు. వీటిని వైద్యుడి సూచన మేరకు ఏ సమయంలో తీసుకోవడం మంచిదో తెలుసుకుని తీసుకోవాలి. ఇక రోజులో అనేక సప్లిమెంట్స్ తీసుకునే వారు గందరగోళానికి గురవుతూ ఉంటారు. అలాంటి వారు రోజూ ఎంత మోతాదులో ఏయే సప్లిమెంట్స్ ను తీసుకుంటున్నామో, ఏ సమయంలో తీసుకుంటున్నామో ఒక రికార్డులో నమోదు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సప్లిమెంట్స్ తీసుకునే విషయంలో గందరగోళం లేకుండా ఉంటుంది. మందులు లేదా సప్లిమెంట్స్ ఏవైనా కూడా వైద్యుడిని సంప్రదించిన తరువాత తీసుకోవడమే మన ఆరోగ్యానికి మంచిది. కనుక ఎవరూ కూడా వారి సొంతంగా మందులను, సప్లిమెంట్స్ ను తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- supplements
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

