Harish Rao | రేవంత్ జైలుకు పోవడం ఖాయం.. అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్దం చేసిండు : హరీష్ రావు
Harish Rao | ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది. అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైద్రాబాద్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్దం చేసిండని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
Harish Rao | మెదక్, ఫిబ్రవరి 09 : ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు పోవడం ఖాయమని.. అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్దం చేసిండని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలు మాయం చేసిండుప్రమాదవశాత్తు జరిగింది కాదు.. రేవంత్ డైరెక్షన్లో జరిగిన ప్రమాదం ఇదన్నారు. మెదక్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ ల్యాబ్ జరిగిన అగ్ని ప్రమాదం వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉంది. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది. అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైద్రాబాద్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్దం చేసిండని హరీష్ రావు ఆరోపించారు. పోలీసుల సహకారంతో ఈ కుట్ర పన్నిండు. హైద్రాబాద్ లో పేదల బతుకులు కూల్చిండని మండిపడ్డారు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేసిండు. రేవంత్ డైరెక్షన్లో పోలీసులు చేసిన దహనకాండ. ప్రమాదవశాత్తు జరిగింది కాదు. రేవంత్ చేసింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి శిక్ష పడక తప్పడు, జైలుకు పోక తప్పదు.
రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ పోయిండు ముఖ్యమంత్రి కానీ మెదక్ కు వచ్చేందుకు ముఖం లేదు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పిండు కాబట్టి ఆయనకు భయం, రుణమాఫీ మాట తప్పి మోసం చేసిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు. ఎరువుల కరువు తెచ్చిండు రేవంత్. రేవంత్ బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని చేయలేదు. రంజాన్ తోఫా కూడా ఇవ్వడం లేదు. షాదీ ముబారక్ చెక్కులు రావడం లేదు. తులం బంగారం దిక్కు లేదన్నారు.
కేసీఆర్‌ను తిడితే పేదల కడుపు నిండుతుందా..?
కేసీఆర్ మైనార్టీ గురుకులాలు కట్టారు. షాదీ ఖానా ఏర్పాటు చేసారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని సెక్యులర్ పార్టీగా నిలబెట్టారని హరీష్ రావు అన్నారు. హిందూ ముస్లింలను అన్నదమ్ములుగా చూశారని అన్నారు. రేవంత్ రెడ్డి తెల్లవారితే కేసీఆర్‌ను తిడుతుంటాడు. కేసీఆర్‌ను తిడితే, హరీష్ రావును తిడితే పేదల కడుపు నిండుతుందా..? ఇక్కడి ఎమ్మెల్యే చాలా గొప్పోడు.ఎన్నికల సమయంలో 25 గంటల కరెంటు ఇస్తా అన్నడు. కనీసం 12 గంటలు కూడా రావడం లేదు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు అని గుండు కొట్టిండన్నారు.
ఉద్యోగస్థులకు డీఏ లేదు, పీఆర్సీ లేదు.రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్ బెన్ఫిట్స్ లేవు. అన్ని వర్గాల ప్రజలను దారుణంగా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసిండు అని హరీష్ రావు అన్నారు.ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లల చదువులను ఆగం చేసిండు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అని దగా చేసిండు. రెండు లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులను మోసం చేసిండు.కాంగ్రెస్ వాళ్లను గెలిపించుకోకుంటే బిల్లులు రావని బెదిరిస్తున్నరట. మెదక్‌లో నీ పిట్ట బెదిరింపులకు, చిల్లర బెదిరింపులకు భయపడం. బిల్లులు మీ జేబుల నుంచి ఇస్తున్నారా..? మీ జాగిరా..? బరాబర్ బిల్లులు వస్తయి, కొట్టాడి సాధించుకుంటమన్నారు.
Read Also :
కాంగ్రెస్ పాలనలో అన్నీ అరాచకాలే : ఎంపీ వద్ది
Age Gap | భార్యా భర్తల మధ్య వయస్సు తేడా అసలు ఎంత ఉంటే మంచిది.?రాజు రవిచంద్ర
Harish Rao | ఒక్కరోజే 15 కార్నర్ మీటింగ్స్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు రికార్డ్..!
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

