Age Gap | భార్యా భర్తల మధ్య వయస్సు తేడా అసలు ఎంత ఉంటే మంచిది.?
మన దేశంలో వివాహాల విషయంలో అనేక సామాజిక నిబంధనలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. భార్యాభర్తల మధ్య వయసులో ఎంత తేడా ఉండాలనేది కూడా అందులో ఒకటి. వివాహ విషయంలో సాధారణంగా చర్చించే అంశాల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా భర్త, భార్య కంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలనేది మన సాంప్రదాయంలో ఒక భాగం.
Age Gap | మన దేశంలో వివాహాల విషయంలో అనేక సామాజిక నిబంధనలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. భార్యాభర్తల మధ్య వయసులో ఎంత తేడా ఉండాలనేది కూడా అందులో ఒకటి. వివాహ విషయంలో సాధారణంగా చర్చించే అంశాల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా భర్త, భార్య కంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలనేది మన సాంప్రదాయంలో ఒక భాగం. అయితే వివాహ విషయంలో భర్త భార్య కంటే పెద్దవాడై ఉండడం నిజంగా అవసరమా.. లేదా.. ఇది కాలం వెంబడి వస్తున్న ఒక నమ్మకమా.. దీని గురించి సైన్స్ ఏం చెబుతుంది.. అసలు భార్య కంటే భర్త వయసు ఎంత ఎక్కువగా ఉండాలి.. అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువైన ప్రేమ వివాహాలు..
భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య 3 నుండి 5 సంవత్సరాల వయసు తేడా ఉండాలని ఇది వివాహానికి అనువైనదిగా భావిస్తారు. ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన వివాహంలో వయసుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మన సమాజంలో భర్త ఎప్పుడూ భార్య కంటే పెద్ద భాగస్వామిగా ఉండాలనే నమ్మకం బాగా లోతుకు పాతుకుపోయింది. అయినప్పటికీ మనలో చాలా మంది ఎక్కువ వయసు తేడాతో కూడా వివాహాలు చేసుకుంటున్నారు. అలాగే స్త్రీలు తనకంటే చిన్న వయసు ఉన్న పురుషుడిని కూడా వివాహం చేసుకుంటున్నారు. సాంప్రదాయ నిబంధనలను పాటించనప్పటికీ వీరు విజయవంతమైన సంబంధాలను కొనసాగిస్తున్నారు. నేటి తరుణంలో ప్రేమ వివాహాలు ఎక్కువ అయ్యాయి. వయసు, ప్రాంతం వంటి వాటితో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. అయినప్పటికీ సమాజంలో కొందరు వివాహ విషయంలో వయసు తేడాపై చాలా పట్టింపును కలిగి ఉన్నారు.
వివాహం అంటే వయస్సు తేడా మాత్రమే కాదు..
ఇక సైన్స్ విషయానికి వస్తే వివాహ విషయంలో శారీరక, మానసిక పరిపక్వత కలిగి ఉండడం చాలా అవసరం. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా పరిణితి చెందుతారు. అమ్మాయిల్లో 7 నుండి 13 సంవత్సరాల మధ్యలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. అబ్బాయిల్లో 9 నుండి 15 సంవత్సరాల మధ్య హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీంతో స్త్రీలు, పురుషుల కంటే ముందుగానే భావోద్వేగ స్థిరత్వాన్ని అభివృద్ది చేసుకుంటారు. భారతదేశంలో అమ్మాయిలు 18 సంవత్సరాలకు, అబ్బాయిలు 21 సంవత్సరాలకు వివాహం చేసుకోవాలని చట్టబద్దం చేయబడింది. దీంతో భార్యాభర్తల మధ్య 3 సంవత్సరాల వయసు వ్యత్యాసాన్ని సాధారణంగా పరిగణిస్తారు. ఈ శాస్త్రీయ దృక్పథం శారీరక పరిపక్వతను సూచిస్తుంది. కానీ వివాహం కేవలం శారీరక అభివృద్దిపై ఆధారపడి ఉండదు. వివాహం భావోద్వేగ, మేధో పరిపక్వతను కూడా కలిగి ఉంటుంది. వివాహం విషయం వయస్సు అంతరంపై ఆధారపడి ఉండదు. వారి ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, గౌరవం, అవగాహన ద్వారా నిలబడుతుంది. వయసు అంతరం 3 లేదా 15 సంవత్సరాలు ఇలా ఎంత అయినప్పటికీ పరస్పర అవగాహన, ప్రేమ, ఉమ్మడి విలువలపై వివాహం ఆధారపడి ఉంటుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

