మక్తల్ టౌన్, సెప్టెంబర్ 15 : మూడు రోజులపాటు నిర్వహించే తెలంగాణ జాతీయ స మైక్యతా వజ్రోత్సవ కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించాలని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక ద్వారక ఫంక్షన్ హాల్లో కొనసాగుతున్న ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం మినీ స్టేడియం నుంచి ర్యాలీ ప్రారంభమై ద్వారక ఫంక్షన్ హా ల్ వరకు కొనసాగుతున్నదన్నారు. ర్యాలీ అనంతరం వజ్రోత్సవ వేడుకలపై సభ ఏర్పాటు చేశామన్నారు. వేడుకలకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీఆర్ఎస్ శ్రేణు లు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మహిళా సంఘాల నాయకురాలు అధికసంఖ్యలో పా ల్గొని విజయవంతం చేయాలన్నారు. ర్యాలీ కొనసాగే రోడ్డు మార్గంలో గుంతలను ఎమ్మెల్యే చదును చేయించారు.