ఊట్కూర్, సెప్టెంబర్ 11 : సీఎం కేసీఆర్ నాయకత్వం లో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చెందుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అ న్నారు. మండలంలోని మల్లేపల్లి, చిన్నపొర్ల, పెద్దపొర్ల, ఎడవెల్లి, కొల్లూరు, సంస్థాపూర్, లక్ష్మీపల్లి, నిడుగుర్తి, బిజ్వా రం, మొగ్దుంపూర్, ఎర్గట్‌పల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం అర్హులైన 403 మందికి పింఛన్ ప్రొసీడింగ్ కా ర్డులను అందజేశారు.
ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు క ల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, బీడీ, గీత, చేనేత కార్మికులు, బోధ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్, ఎయిడ్స్ బాధితులకు కూడా పింఛ న్ అందిస్తూ సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోతాడన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్న రాష్ర్టాల్లో ఇలాంటి ఒక్క పథకమైనా అమలు చే స్తున్నారా అని ప్రశ్నించారు. దేశంలో నల్లచట్టాల అమలు తో మోడీ ప్రభుత్వం రైతుల ఉసురు తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్ర జలు సుఖంగా బతుకుతున్నారని, మతం ముసుగులో బీజే పీ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే సహించబోమని హె చ్చరించారు. నియోజవర్గంలో కొందరు కాంగ్రెస్ నాయకు లు కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగన్నట్లు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఆసరా పింఛన్ అందజేస్తున్నదన్నారు. సంబంధిత మీ సేవా కేం ద్రాల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అర్హులైన వా రు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, దళారులను ఆశ్రయించొద్దన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, తాసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో కాళప్ప, రైతుబంధు సమితి మండల చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, విండో మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు రవిప్రసాద్‌రెడ్డి, టీఆర్ఎస్ మ క్తల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రామలింగం, మండ ల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, శివరామరాజు, కతల ప్ప, విజయసింహారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.