ప్రేమలో.. మరోసారి!
ఇండస్ట్రీలో ‘లవ్ బర్డ్స్' కామన్! వాళ్ల చుట్టూ ఏవేవో గాసిప్స్ వినిపించడం కూడా అంతే కామన్! అయితే, ప్రస్తుతం ఈ గాసిప్స్ సుడిగాలిలో చిక్కుకున్నది టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. దిశా పటానీ. ఎప్పుడూ హాట్‌హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్చేసే ఈ భామ..
ఇండస్ట్రీలో ‘లవ్ బర్డ్స్’ కామన్! వాళ్ల చుట్టూ ఏవేవో గాసిప్స్ వినిపించడం కూడా అంతే కామన్! అయితే, ప్రస్తుతం ఈ గాసిప్స్ సుడిగాలిలో చిక్కుకున్నది టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. దిశా పటానీ. ఎప్పుడూ హాట్‌హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్చేసే ఈ భామ.. తాజాగా, తన లవ్ ఎఫైర్ ముచ్చట్లతో హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది.
ఇప్పుడు మరోసారి ప్రేమలో పడిపోయిందని ‘బీటౌన్’ కోడై కూస్తున్నది. పంజాబీ సింగర్-రాపర్ తల్విందర్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నదని పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఆ వార్తలకు మరింత బలాన్నిస్తూ.. ఇటీవలే ఓ వివాహ వేడుకకు వీరిద్దరూ జోడిగా హాజరయ్యారు. జంటగా సందడి చేశారు. ఆ తర్వాత ఓ మ్యూజిక్ ఫెస్టివల్లోనూ కలిసే కనిపించారు. వీరిద్దరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగవైరల్ కావడంతో.. ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో తల్విందర్ సింగ్ సిద్ధూ కూడా ఈ విషయంపై స్పందించాడు. ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ గాసిప్స్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తామిద్దరం పరిచయమై కొద్దిరోజులే అవుతున్నదని, ఇంత త్వరగా ఇలా వైరల్ అవుతామని అస్సలు ఊహించలేదని వాపోయాడు.
ఇక ప్రస్తుతం ఒకరినొకరు తెలుసుకునే దశలోనే ఉన్నారట. కాబట్టి, సోషల్ పుకార్లతో వచ్చే ఒత్తిడిని కోరుకోవడం లేదనీ చెప్పుకొచ్చాడు. ఇప్పటికైతే తామిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే.. అంటూ, అసలు ముచ్చటను దాటవేశాడు. అయితే, ఇంటర్వ్యూలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తాను ప్రతిరోజూ ప్రేమలో పడుతూనే ఉంటాననీ, ఇప్పుడూ ప్రేమిస్తున్నాననీ ఫన్నీగా చెప్పాడు. దాంతో, ఆ మాటలు దిశానీ ఉద్దేశించి చేసినవే అంటూ.. నెట్టింట చర్చ మొదలైంది.
ఇక వీళ్ల వయసుకు సబంధించిన ఓ విషయం కూడా తెగ వైరల్ అవుతున్నది. దిశా పటానీకి 33 ఏళ్లు కాగా.. తల్విందర్ ఆమె కన్నా ఐదేళ్లు చిన్నోడు. ఇక దిశ పటానీ విషయానికి వస్తే.. తెలుగులో వరణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎంఎస్ ధోని బయోపిక్‌తో బాలీవుడ్ బాటపట్టింది. పలు విజయవంతమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ఇండియా సినిమా ‘కల్కి 2898 ఏడీ’లోనూ మెరిసింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

