న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కంటి చూపు కోల్పోయానని, క్లినికల్ డిప్రెషన్‌తో బాధ పడుతున్నానని, జైలు ఆంక్షలు ఇబ్బందులు పెడుతున్నాయని, ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాన్ని ఎగ్గొట్టిన కేసులో తన విచారణను వాయిదా వేయాలన్న భారతీయ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అభ్యర్థనను లండన్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ కేసులో పిటిషనర్ తీర్పు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తోందని జడ్జి పేర్కొన్నారు.