న్యూఢిల్లీ : తాను ఎప్పుడు ముఖ్యమంత్రిని అవుతాననేది కాలమే చెబుతుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
కొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత సీఎం మార్పు ఉంటుందని అనుకోవచ్చా అని విలేకరులు శనివారం మంగళూరులో ప్రశ్నించగా దాన్ని కాలమే నిర్ణయిస్తుందని డీకే చెప్పారు. ప్రజలకు, మద్దతుదారులకు (శాసనసభ్యులు) తాను ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉండటం సహజమని, కానీ పార్టీ నిర్ణయమే అంతిమమని ఆయన పేర్కొన్నారు.