తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుతగులుతున్న కేంద్రాన్ని ఎదిరించాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిందేనని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. రాష్ర్టాల అభివృద్ధికి సహకరించకపోగా ప్రభుత్వాలను కూలదన్నే కేంద్రం దుర్నీతిని ఎండగట్టే ధీశాలి కేసీఆర్ ఒక్కరే అని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీ పెట్టి కేసీఆర్ ప్రధాని కావాల్సిందేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డుతున్న కేంద్రానికి బుద్ధి చెప్పేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సై అంటుండడంతో ఇక దేశ్‌కీ నాయక్‌గా మారనున్నారు.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వచ్చి చక్రం తిప్పాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు బలంగా కోరుతున్నారు. శనివారం మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వివిధ వర్గాల ప్రజలను కదిలిస్తే మెజార్టీ వర్గాల వాళ్లు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వంలోని పార్టీనే ప్రత్యామ్నాయం అవుతుందని బల్లగుద్ది చెబుతున్నారు.
అలుపెరగని పోరాటంచేసి తెలంగాణను సాధించుకుని ఆ తర్వాత అతితక్కువ కాలంలోనే రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం చేయాల్సిందే అంటున్నారు. విజన్ ఉన్న నేత కేసీఆర్ అని కేంద్రంలో బీజేపీ విధానాలను ఎండగట్టడంలో ఆయనకు మించి లేరన్నారు. దేశ రాజకీయాల్లోకి రావాలని, జాతీయ రాజకీయాలను మలుపుతిప్పే సత్తా ఆయనకే ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. తెలంగాణలో అమలు చేసిన పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే రైతు రాజుగా మారడం ఖాయమని, పేదల బతుకులు మారతాయని అంటున్నారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదలతో లాక్కొని పెద్దలకు పెడుతుందని విమర్శిస్తున్నారు. ఈడీ, సీబీఐలను వాడుకుని దేశంలోని వ్యాపారుల్లో భయాందోళనలకు గురిచేస్తున్నది వాస్తవమేనని అంటున్నారు. నల్లధనాన్ని తీసుకువచ్చి పేదోళ్ల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులకు వేలకోట్లు అప్పులు ఉన్న వాళ్లను మాఫీ చేసి అంబానీ, అదానీలకు కొమ్ముకాస్తున్నారని, ఈడబ్బుతో దేశంలో రైతులకు, పేదలకు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇవ్వొచ్చని సామాన్యులు సైతం అంటున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు దాటినా ఇంకా వెనుకబాటుకు కారణం జాతీయ పార్టీల విధానాలేనని మెజార్టీ వర్గం అంటున్నది. దేశరాజకీయాలు భ్రష్టుపడుతున్నాయని ప్రభుత్వాలన్నీ బడా పారిశ్రామిక వేత్తలకే సహకరిస్తున్నాయంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మడం ప్రైవేట్‌ను ప్రోత్సహించడం చూస్తుంటే దేశం ఎటు పోతుందోనని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈనేపథ్యంలో కేసీఆర్ జాతీయ పార్టీపై దృష్టి పెట్టడం హర్షించదగ్గ పరిణామమని అంటున్నారు. ఆయన నాయకత్వంలోనే దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటదని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలైతే స్వర్ణయుగమే అని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని వస్తున్న వార్తలపై జనం ఆసక్తి కనబరుస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ప్రకటిస్తారని గ్రామీణ ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులైతే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసే సత్తా ఆయనకే ఉందని మారుమూల గ్రామస్తులు సైతం అంటున్నారు. హోటళ్లు, రచ్చబండలు, సమావేశాల వద్ద ఏ నలుగురు కలిసి మాట్లాడిన కేసీఆర్ జాతీయ పార్టీపైనే అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో వచ్చి దేశంలో చక్రం తిప్పాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్టీపేరు మీద అప్పుడే ఊహాగానాలు బయలు దేరాయి. జెండా, అజెండా ఎలా ఉండబోతుందనే ఆసక్తికర చర్చ సాగుతున్నది.
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణ వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్, వైద్యం, మహిళ ప్రగతి, ఇలా అన్ని రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నది. కొత్తగా రాష్ర్టాల ఏర్పాటుతో వలసల జిల్లాగా పేరున్న పాలమూరుకే బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తదితర రాష్ర్టాల నుంచి పేదలు వలసలు వస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు, వ్యవసాయంతో పాటుగా హోటళ్లు, దుకాణాల్లో పని చేసుకుంటూ పొట్ట పోషించుకుంటున్నారు. ఉపాధి కోసం వలస వెళ్లే పాలమూరుకే దేశం నుంచి వలసలు వచ్చే పరిస్థితులు ఏర్పడేటందుకు సీఎం కేసీఆర్ పరిపాలనే నిదర్శనం.
అయితే కేంద్రం రాజకీయ కక్ష్యతో విద్యుత్, రైల్వేలో నిర్లక్ష్యం, ఉపాధి హామీ, ఉచిత సంక్షేమ పథకాల రద్దులాంటి చర్యలకు పాల్పడుతున్నది. దీనివల్ల పేదలకు రాబోయే కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా రైతుభీమా, రైతుబంధు, ఆసరా పింఛన్లు, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్లాంటి పథకాలు అమలవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఒత్తిడి తీసుకొస్తోంది. దీన్ని అడ్డుకోవాలంటే ఢిల్లీ కోటలు బద్ధలు కొట్టడమే ఏకైక మార్గంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వడం లేదు.
రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే మార్గంగా ప్రజలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రెండు సార్లు సీఎంగా, రాజకీయ చాణుక్యం ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి ఫలాలను దేశంలోనూ అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు కొనసాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు అంటున్నారు.
కేంద్రంలో అధికారంలో వచ్చిన మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర, పెట్రోల్ ధర, జీఎస్టీపై సామాన్య జనం మండిపడుతున్నారు. చిరుఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, మహిళలు, రైతులు కేంద్రం విధానాలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారని కేసీఆర్ లాంటి నేత జాతీయ రాజకీయాల్లో అవసరం అని ఘంఠాపథంగా చెబుతున్నారు. బడా బడా పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీపై విద్యుత్ అందిస్తున్న కేంద్రం రైతులకు దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో అమలు చేస్తున్నప్పుడు దేశంలో ఇస్తే తప్పేముందని అంటున్నారు. వంటగ్యాస్ మీద సబ్సిడీలు ఎత్తివేసి ఏకంగా గ్యాస్ ధరను రూ.1190కు పెంచడం అన్యాయమని మధ్యతరగతి జనం వాపోతున్నారు. ప్రతి వస్తువుపై జీఎస్టీ విధానాన్ని కూడ తప్పుపడుతున్నారు.
సీఎం కేసీఆర్ లాంటి నాయకుడి కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ కి ట్, కల్యాణలక్ష్మి, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం.. ఇలా అనేక పథకాలతో మహిళలకు అండగా నిలిచాడు. అన్ని వర్గాల కో సం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. అందుకే ఆయన జాతీ య రాజకీయాల్లో వెళ్తే దేశం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఒక్కడిగానే బయలుదేరి అందరినీ కలుపుకొని వి జయం సాధించాడు. రాష్ట్రంలో మహిళలకు ప్రవేశపెట్టిన పథకా లు దేశవ్యాప్తంగా రావాలని మహిళలు కోరుతున్నారు. గాంధీజీ కలలుగన్న రాజ్యం రావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– చరణి, గ్రామ సంఘం లీడర్, శాంతినగర్
టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, సీఎం కేసీఆ ర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశం సుభిక్షం గా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతిఒక్కరూ ఇతర రాష్ర్టాల తో తెలంగాణను పోల్చుకోవాలి. ఇక్కడి అ భివృద్ధిని బేరీజు వేసుకోవాలి. తెలంగాణ లో ఉన్న సంక్షేమం ఎక్కడా లేదు. సీఎం కేసీఆర్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశం రూపురేఖలే మారుతాయి. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలన్నీ దేశంలో కూడా అమలవుతాయి.
– మల్లంపల్లి సురేశ్, చేనేత కార్మికుడు, గట్టు
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయా ల్లో చక్రం తిప్పడం ఖాయం. అన్ని వర్గాల ను ముందుకు తీసుకెళ్లడంలో సీఎం చేపట్టి న సంక్షేమ పథకాలు యావత్ దేశాన్నే ఆకర్శించాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఢీకొట్టే సత్తా ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉ న్నది. ఇందులో ఎలాంటి సందేహం లే దు. పలు రంగాల్లో విశేష అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ జాతీ య పార్టీ ఏర్పాటు చేయడం ఇప్పుడు దేశానికి ఎంతో అవసరం.
– శిరీష, సర్పంచ్, తిప్పారెడ్డిపల్లి, వంగూరు
సీఎం కేసీఆర్ సార్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో సాగునీరు పుష్కలంగా ఉన్నది. పంటలు మంచిగా పండుతున్నాయి. చేతి నిండా పని దొరుకుతున్నదది. ఆయన ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం. సీఎం కేసీఆర్ సార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తాడు. నాకు 58 ఏండ్లు ఉండడంతో కొత్త జాబితాలో పింఛన్ కార్డులు ఇచ్చారు. కేసీఆర్ సార్ మా దేవుడు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– గండికోట అంజయ్య, కూలీ, మర్రిపల్లి, చారకొండ మండలం
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. రైతుబం ధు, మిషన భగీరథ పథకాలు దేశవ్యాప్తం గా ప్రవేశపెట్టే సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉన్నది. నల్లధనాన్ని వెనక్కి తేవడంలో, దే శ భద్రత విషయంలో కేసీఆర్ విజయం సాధిస్తారన్న నమ్మకం అందరికీ ఉన్నది. దేశవ్యాప్తంగా కులమతాలకతీతంగా పాలన రావాలన్నదే ఆశ.
– కరీముల్లా, అధ్యాపకుడు, గద్వాల
ఉత్తర భారతదేశానికి చెందిన నేతలు దక్షిణ తెలంగాణను చులకనగా చూస్తున్నారు. కేంద్రం మనకు తగిన గుర్తింపునివ్వడం లేదు. ఏండ్ల తరబడి కించపరుస్తున్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తి పీఎం కావడం ఖాయం. అదే జరిగితే మన రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో ఉంటుంది. దేశంలో ప్రతి ఒక్కరి మద్దతు ఆయనకు ఉన్నది.
– ప్రవీణ్‌కుమార్, వ్యాపారి, మహబూబ్‌నగర్
దేశ రాజకీయాల్లో మార్పు వచ్చేందుకు సీఎం కేసీఆర్ రాకను స్వాగతిస్తున్నా. జాతీయ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యం. రాష్ట్రం సాధనలో ఆయన వేసిన ఒక్క అడుగుకు లక్షల అడుగులు తోడయ్యాయి. ఇప్పుడు కూడా మోదీ సర్కార్‌ను గద్దె దింపాలంటే ఒక్క కేసీఆర్ వల్లే అవుతుంది. దేశంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది. అప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది.
– బాలకిషన్‌రావు, విశ్రాంత ఉద్యోగి, గద్వాల
దోపిడీకి గురైన తెలంగాణకు విముక్తి కలిగించేందుకు కంకణ కుట్టుకున్న మహానేత. తన ఆలోచనా పటిమతో,ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి, ఒంటి చేత్తో నడిపించిన రథసారథి, అపర చాణక్యుడు సీఎం కేసీఆర్. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించి, దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. దేశం నేడు ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వాటి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు అవసరం.
– వేదార్థం మధుసూదనశర్మ, సాహితీవేత్త, కొల్లాపూర్
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతుండటం శుభ పరిణామం. తెలంగాణను సాధించిన నేతగా పేరు తెచ్చుకున్న ఆయనకు దేశంలోనూ ఆ స్థాయిలో పేరొస్తుంది. కేసీఆర్ సీఎం అయ్యాక దూప దీప నైవేద్య పథకం కింద అర్చకులకు చాలా మేలు జరిగింది. బ్రాహ్మణులకు వెన్నుదన్నుగా నిలిచిన కేసీఆర్ ఇదే తరహాలో జాతీయ స్థాయిలో కూడా ఈ పథకాలను అమలు చేస్తే దేశంలోని బ్రాహ్మణులంతా ఎంతో మేలు చేకూరుతుంది.
– పీవీ లక్ష్మీకాంతాచార్యులు, అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు,వనపర్తి
దేశానికి ఉజ్వల భవిష్యత్ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైతది. భారత్ దేశానికి విజన్ కలిగిన నాయకుడు కావాలి. తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేస్తే మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని భావిస్తున్నాం. స్వరాష్ట్రం కోసం 14 ఏండ్లు సుదీర్ఘంగా చేసిన పోరాట స్ఫూర్తి, పటిమతో దేశాన్ని అన్ని రంగాల్లో నెంబర్‌వన్ స్థానంలో నిలిపే సత్తా కేసీఆర్‌కు ఉన్నది. అన్ని రాష్ర్టాల ప్రజలు మన పథకాలను అమలు చేయాలని కోరుకుంటున్నారు. అందుకే ఆయన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆకాంక్ష. కేంద్రంలో కేసీఆర్ అధికారం చేపడితే భారత్ రూపురేఖలే మారుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే కేసీఆర్ దేశ పగ్గాలు చేపట్టాలని ప్రజలు ముక్తకంఠంతో స్వాగతం పలుకుతున్నారు.