మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 9 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : దేశం కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నదని, తక్షణమే సీఎం కేసీఆర్ జా తీయ రాజకీయాల్లోకి రావాలని టీఆర్ఎస్ ముక్తకంఠంతో తీర్మానించింది. దేశంలో మో దీ అరాచక పాలన సాగిస్తున్నాడని, బీజేపీ మ త విద్వేషాలతో ప్రజలను విచ్ఛిన్నం చేస్తున్నదని ఈ దుర్మార్గ పాలన, విధానాల నుంచి దే శాన్ని రక్షించగలిగే నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులందరూ ఏకబిగిన చెప్పారు.
దమ్మున్న నేత కేసీఆర్.. : గువ్వల
దేశంలో దుర్మార్గాలను అరికట్టాలంటే ద మ్మున్న కేసీఆర్ వంటి నేతలు అవసరమని టీ ఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, విప్ గువ్వల బాలరాజు తెలిపారు. కేసీఆర్ జాతీ య రాజకీయ ప్రవేశం చేసి దేశానికి దిశానిర్దే శం చేయాలని తెలంగాణలో ప్రతి ఒక్కరూ కో రుకుంటున్నారన్నారు. తెలంగాణలో గొప్ప పాలన అందిస్తున్న విషయం దేశవ్యాప్తంగా చ ర్చ జరుగుతుందని, ఈ ఫలాలు దేశానికి ద క్కాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రా వాలన్నారు. దళితబంధు లాంటి గొప్ప ప థకం తీసుకొచ్చిన మహనీయుడు కేసీఆర్ అ ని అన్నారు. కేసీఆర్ కారణజన్ముడని, అందరి కీ న్యాయం జరుగుతుందన్నారు.
విజన్ ఉన్న నేత కేసీఆర్ : లక్ష్మారెడ్డి
కేసీఆర్ విజన్ ఉన్న నేత.. జాతీయ రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని టీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఎనిమిదేండ్లలో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ గా తీర్చిదిద్దారన్నారు. దేశంలోని వనరులు స రిగ్గా వినియోగించడంలో జాతీయ పార్టీలు వి ఫలమయ్యాయనారు. అవన్నీ సక్రమంగా వి నియోగిస్తే ప్రపంచంలోనే భారత్ నంబర్‌వన్ అయ్యేదని చెప్పారు. ఎంతో పరిణతి కలిగిన ఉద్యమనేత, తెలంగాణను తీసుకొచ్చిన యో ధుడు జాతీయ రాజకీయాల్లో రావాలని ఎప్పటినుంచో డిమాండ్లు వస్తున్నాయన్నారు. వ చ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాలను మలు పు తిరగడం ఖాయమని అభిప్రాయపడ్డారు.
దేశ రాజకీయాల్లో రావాలి : గట్టు యాదవ్
దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల సం క్షేమం కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నదని టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ తెలిపారు. బీజేపీ, మోదీ కేవలం మత విద్వేషాలను రెచ్చగొడుతూ, సంపన్న వర్గాల కొ మ్ముకాస్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో బీ జేపీని ఎదుర్కోవాల్సిన కాంగ్రెస్ చతికిలపడిందన్నారు. ఈ తరుణంలో కేసీఆర్ వంటి బలమైన నాయకుడు దేశానికి ఎంతో అవసరమ ని, దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పితే విజయం సాధిస్తాడనే నమ్మకం ఉన్నదన్నారు. తెలంగాణను అన్ని రాష్ర్టాల ప్రజలకు రోల్‌మోడల్‌గా చూపించి ఇక్కడ అమలవుతున్న సంక్షే మ పథకాలు, అభివృద్ధి నమూనాకు దేశ ప్రజలందరూ ఆకర్షితులవడం ఖాయమన్నారు.
రైతు రాజ్యం రావాలి.. : రాజేందర్‌రెడ్డి
దేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రైతు రాజ్యం రావాలి. అప్పుడే రైతులకు మేలు జ రుగుతుందని టీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇది నూటికి నూరు శాతం కావాలంటే అది కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. బీజే పీ నాయకులు చెబుతున్నట్టుగా డబుల్, త్రి బుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడా స క్సెస్ కాలేదన్నారు. రోల్ మాడల్‌గా చెబుతు న్న గుజరాత్లో 25 ఏండ్లుగా బీజేపీ ప్రభుత్వ మే ఉన్నదని, కానీ, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 13 లక్షల మందికి మాత్రమే పింఛన్లు అందుతున్నాయన్నారు. బోర్ల కాడ మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారని, త ప్పకుండా విజయం సాధిస్తారన్నారు.