నవాబ్‌పేట, సెప్టెంబర్ 5 : అంకిత భావంతో విధులు నిర్వహించి ఎంతో మంది వి ద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు టీఎన్ శ్రీధర్ సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. నవాబ్‌పేట మండలం యన్మన్గండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చే స్తున్న శ్రీధర్ ఎనిమిది సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కొత్త ఆవిష్కరణలు చేపట్టారు.
ఉపాధ్యాయులు శ్రీ ధర్ చేపట్టిన ఆవిష్కరణలకుగానూ గతంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అ వార్డులు, రివార్డులు దక్కాయి. పాఠశాలలో మౌలిక వసతులు పెంచేందుకు తనవంతు కృషి చేశారు. వీటన్నింటినీ గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీధర్‌ను జాతీయ ఉ త్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశాయి. ఇందులో భాగంగానే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీధర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
అనంతరం ఆయన ఫోన్లో ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. దేశంలోనే అత్యున్నతమైన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడానికి చాలా మంది సహకారం ఉందన్నారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తుల సహకారం మరువలేనిదన్నారు. శ్రీధర్ అవార్డు అందుకోవడంపై ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ చైర్మన్ లక్ష్మయ్య, వైస్ చైర్మన్ చందర్‌నాయక్, ముడా డైరెక్టర్ చెన్నయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, యన్మన్గండ్ల జీహెచ్ఎం దశరథ్‌నాయక్, సర్పంచ్ జయమ్మహన్మంతు, ఉపసర్పంచ్ రఘువీర్, ఎస్ఎంసీ చైర్మన్ హన్మంతునాయక్ అభినందనలు తెలిపారు.