మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 4 : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కొలువుదీరిన గణనాథుడికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని 21వ వార్డు మహేశ్వరికాలనీలో కౌన్సిలర్ ఆనంద్‌గౌడ్, కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీహరిసాగర్, కంఠేశ్వర్రావు, నర్సింహులు, సుదీప్, చారి, శివ పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 4 : మున్సిపాలిటీలో కొలువుదీరిన గణనాథులకు ఉత్సవ కమిటీల సభ్యులు ప్ర త్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశా రు. అనంతరం గణేశ్ లడ్డూలకు వేలం నిర్వహించా రు. వివిధ ప్రాంతాల్లో గణనాథులను ఎమ్మెల్యే లక్ష్మారెడి, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి దర్శించుకొని పూజలు చేశారు. భగత్‌సింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో టీఎన్జీవోఎస్ భవనం సమీపంలోని వినాయక మండపం వద్ద విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. అలాగే పద్మావతికాలనీలోని పార్కులో ఏర్పాటు వినాయక మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం జడ్చర్లలో వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా మున్సిపల్, పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులకు అన్నదానం
బాలానగర్, సెప్టెంబర్ 4 : మండలకేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద ఆదివారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే భవానీమాత ఆలయంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గిరిధర్‌రావు, వెంకటేశ్, దత్తాత్రేయ, శ్రీనివాసు లు, మల్లేశ్, గణేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, సెప్టెంబర్ 4 : మండలకేంద్రంలో కొలువుదీరిన గణనాథుడికి రైతుబంధు సమితి మండ ల అధ్యక్షుడు నర్సింహులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏ ర్పాటు చేశారు. రంగారెడ్డిగూడలో గణనాథుడికి సింగిల్‌విండో మాజీ డైరెక్టర్ రవికుమార్‌గుప్తా పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, సెప్టెంబర్ 4 : మండలంలోని వేముల, బో యిన్‌పల్లి, చిల్వేర్, కొత్తపల్లి, వాడ్యాల్ గ్రామాల్లో గణనాథులకు విశేష పూజలు చేశారు. మండలకేంద్రంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో టీఆర్ఎస్వీ తాలూకా ఇన్చార్జి భాస్కర్ దంపతులు, భీంరెడ్డి, యా దిరెడ్డి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 4 : అడ్డాకుల మండలంలోని కందూరులో ప్రతిష్ఠించిన గణనాథుడికి జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని పలు గ్రామాల్లో గణేశ్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.