మక్తల్ అర్బన్, ఆగస్టు 25 : శాంతియుతంగా వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలని, నిబంధనలు ఎవ రూ అతిక్రమించొద్దని సీఐ సీతయ్య అన్నారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చే సిన వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణానికి చెం దిన హిందూ, ముస్లింలు, యువకులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను దృష్టిలో పె ట్టుకొని పలు సూచనలు సూచించారు.
ఈనెల 31న వినా యక చవితి సందర్భంగా ముందు జాగ్రత్తగా పలు కాలనీ ల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యు లు జాగ్రత్తలు వహించాలన్నారు. ఆలయాలు, మసీదులు, దర్గాల వద్ద అల్లర్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత్తగా ఉండాలన్నా రు. ప్రస్తుతం 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. మండపాలు ఏ ర్పాటు చేసుకునే ముందు స్టేషన్లో అనుమతి తీసుకోవాలన్నారు. అదేవిధంగా కమిటీ సభ్యుల పేర్ల వివరాలు తెలుపాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై పర్వతాలు, శ్రీహరి, రాంమాదవ్, శంషొద్ద్దీన్, యువకులు పాల్గొన్నారు.
మరికల్, ఆగస్టు 25 : మండలంలోని ప్రతి వినాయ మండపాలకు జియో ట్యాగ్ క చ్చితంగా ఏర్పాటు చేస్తామని సీఐ రాంలాల్ అన్నారు. మం డలంలోని పోలీస్‌స్టేషన్‌లో గు రువారం ఏర్పాటు చేసిన శాం తి సమావేశంలో సీఐ మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను నిర్వహించుకోవాలని, డీజేలకు అనుమతి లేదన్నారు. విద్యుత్ ఏర్పాట్ల వద్ద జాగ్రత్తలు వహించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై అశోక్‌బాబు, ఏఎస్సై ఎల్ల య్య, పోలీస్ సిబ్బంది, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కోస్గి, ఆగస్టు 25 : శాంతియుతంగా పండుగలు నిర్వహించుకోవాలని సీఐ జనార్దన్‌గౌడ్ అన్నారు. కోస్గి పోలీస్టేషన్లో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ, ము స్లింలతో గురువారం శాంతి సమావేశం నిర్వహించారు. ప్ర శాంత వాతావరణంలో వినాయక చవి తి ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నా రు. ఎలాంటి సమాచారం ఉన్న పోలీసులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై జగదీశ్వర్, ఆయా కులా ల మతపెద్దలు, యువకులు తదితరు లు పాల్గొన్నారు.
నర్వ, ఆగస్టు 25 : మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితిని ప్ర శాంతంగా నిర్వహించుకోవాలని ఎస్సై విక్రమ్ అన్నారు. గురువారం నర్వ పోలీస్‌స్టేషన్‌లో శాంతి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వినాయక మండపాలు ఏర్పాటుకు పోలీసు లు, విద్యుత్ శాఖ అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి అన్నారు. మండపాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాల న్నారు. నిమజ్జన ఊరేగింపులో డీజేలు, సౌండ్ బాక్సులను ఉపయోగించరాదని, ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు, శాంతి కమిటీ సంఘం నాయకులు తదిత రులు పాల్గొన్నారు.
మద్దూర్, ఆగస్టు 25 : వినాయక ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సీఐ జనార్దన్‌గౌడ్ అన్నా రు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హిందూ, ముస్లింలు, గణేశ్ ఉ త్సవ కమిటీ సభ్యులతో గురువారం శాంతి సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గణేశ్ ఉ త్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ఎలాంటి ఘ టనలు జరుగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. మండపా ల నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై సతీశ్, సిబ్బంది పాల్గొన్నారు.