మరికల్, ఆగస్టు 25 : మండలంలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కా ర్యక్రమం ఘనంగా చేపట్టారు. విగ్రహ దాత దండు నారాయణరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, ఆగస్టు 25 : మండలంలోని బోయిన్‌పల్లిలో గురువారం ఆంజనేయస్వామి ఆలయం ఎ దుట ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా ముగిశా యి. స్వామివారికి పంచామృతాభిషేకం, అలంకరణ, హో మం, ధ్వజస్తంభపూజ, ప్రతిష్ఠ, పూర్ణాహుతి తదితర పూజ లు వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు అన్నదానం చేపట్టారు. మహిళ లు, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని, ధ్వజస్తంభాన్ని దర్శించుకొన్నారు.
ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేపూరి రాములు, సర్పంచ్ త్రివిక్రమరావు, ఉపసర్పంచ్ నర్సప్ప, మాజీ మండలాధ్యక్షుడు సదాశివరెడ్డి పాల్గ్గొన పూజలు చేశారు. అలాగే మండలంలోని ఒండ్రుచెలిమితండాలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణలతో మధ్య ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చే శారు. కార్యక్రమంలో మేకహనుమాన్తండా సర్పంచ్ నీలిబాయి, ఉపసర్పంచ్ సురేశ్‌నాయక్ పాల్గొన్నారు.
ఊట్కూర్, ఆగస్టు 25 : శ్రావణమాసం సందర్భంగా మండలంలోని నిడుగుర్తి షిర్డీసాయి బాబా ఆలయంలో గురువారం సాయి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సాయిబాబాకు ఉదయం మహామంగళహారతి, మధ్యాహ్న హార తి, సాయం కాలం సంధ్యా హారతి నిర్వహించారు. పూజా కార్యక్రమానికి హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదం వితరణ చేశారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, ఆగస్టు 25 : మండలంలోని రాంసింగ్తం డా పంచాయతీ పరిధిలోని పున్యానాయక్తండాలో గురువారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపనను వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్యన ప్రత్యే క పూజలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గిరిజనుల కులగురువు భోజ్యాభావాజీ ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయంగా పూజలు చేశారు. ఆలయ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన సర్పంచ్ నర్సింహానాయక్ను తండావాసులు పూలమాల, శాలువాతో సన్మానించారు. కార్యక్రమం లో సేవాలాల్ ఉత్సవ కమిటీ మండల ఉపాధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, టీఆర్ఎస్ యూత్వింగ్ అధ్యక్షుడు మెండె శ్రీను, ప్రధాన కార్యదర్శి రఘుగౌడ్, నాయకులు భాస్కర్, బాబూనాయక్, కిషన్‌నాయక్, అనిల్‌నాయక్, పాండునాయక్ తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట, ఆగస్టు 25 : మండలంలోని నిజాలాపూర్ వాగుమైసమ్మ ఆలయంలో గురువారం భక్తిశ్రద్ధలతో చండీయాగం నిర్వహించారు. గ్రామానికి చెందిన జాజాల లక్ష్మ మ్మ, రాంచందర్ దంపతుల ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొని వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అ మ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చండీయాగంతోపాటు మండపపూజ చేశారు. అదేవిధంగా గాయత్రీపూజ, నవగ్ర హ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, గ్రామపెద్దలు, యువకుల, మహిళలు పాల్గొన్నారు.
భూత్పూర్, ఆగస్టు 25 : మున్సిపాలిటీలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం మాతృమండలి ఆ ధ్వర్యంలో సామూహిక వ్రతాలు నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని ఉమాగౌరీశంకరుల వ్రతం చేశారు. ఆలయ అర్చకుడు విజయ్ ఆధ్వర్యంలో వ్రతాలు నిర్వహించారు. లోకకల్యాణం కోసం వ్రతాలను ప్రతి నెలా నిర్వహిస్తున్నట్లు మాతృమండలి సభ్యురాలు పుష్పమ్మ తెలిపారు. కార్యక్రమంలో రామేశ్వరమ్మ, శ్రీలత, సరస్వతీ తదితరులు పాల్గొన్నారు.