వనపర్తి, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వనపర్తి నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి ఆరు గ్రామాలను ఎంపిక చేసి పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొనాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఈమేరకు అధికారులతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం గోపాల్పేట మండలంలో ఎంజీకేఎల్ఐ లిఫ్ట్ 5 కెనాల్ పనులను పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తి చేసి రెండు నెలల్లో నీరందించాలని ఆదేశించారు.
ప్రజల స మస్యలు పరిష్కరించేందుకు వనపర్తి జిల్లా అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచనతో ఉన్నతాధికారులు బుధవారం నుంచి పల్లెనిద్ర చేపట్టనున్నారు. సాయంత్రం వేళ వెళ్లి గ్రామాల్లో బస చేసి ఉదయం ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా చ ర్యలు చేపట్టనున్నారు. ఈ విషయంపై బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వనపర్తి నియోజకవర్గంలో చేపట్టే ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలకు మార్గదర్శిగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి ఆరు గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పెబ్బే రు, వనపర్తి మున్సిపాలిటీల నుంచి తొమ్మిది వార్డుల్లో అధికారులు తమ బృందాలతో పర్యటిస్తారని చెప్పారు. వజ్రోత్సవాల్లో భాగంగా అదనంగా ఈ కార్యక్రమం చే పట్టినట్లు చెప్పారు. అధికారుల బృందాలు రాత్రి గ్రా మాలకు రాగానే అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు, ప్రజ లు స్వాగతం పలుకాలని, వారి బసకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
పల్లెనిద్రకు వెళ్లే అధికారులు గ్రామాల్లోని పేదల ఇండ్లలోనే బస చేస్తారని, బస చేసే ప్రాంతాల్లో సాధారణ భోజనం ఏర్పాటు చేయాలని ప్రజలకు సూ చించారు. నిద్ర చేసి తెల్లవారుజామున ఆయా గ్రామా ల్లో లేదా వార్డుల్లో ఉదయం అధికారులు పర్యటిస్తారన్నారు. గ్రామ ప్రజల సమస్యలు వింటారని, అక్కడికక్కడ పరిష్కరించాల్సిన సమస్యలు ఉంటే సత్వరమే పరిష్కరిస్తారని, లేని పక్షంలో కలెక్టర్ లేదా తన దృష్టికి సమస్యను తీసుకురావాలని అన్నారు. పింఛను లేదా ఇతర సమస్యలుంటే అర్హులైన వారి పేర్లను గుర్తించాల ని సూచించారు. అదేవిధంగా ప్రజలు కూడా అభివృద్ధి లో భాగస్వాములు కావాలని. హరితహారం వంటి కా ర్యక్రమాల్లో ఏ మేరకు పాల్గొన్నారో పరిశీలించి హరితహారం ప్రాధాన్యతను వివరించాలన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారి ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నామని, ప్రజలందరూ దీనిని విజయవంతం చేయాలని కోరారు. నియోజకవర్గంలో విడతల వారీగా 135 గ్రామాల్లో దీనిని కొనసాగిస్తామని, మొదటగా ఏడు మండలాల్లో మండలానికి ఆరుగ్రామాల చొప్పున ఎం చుకొని వివిధశాఖల అధికారులు, సిబ్బంది బృందాలుగా పల్లెనిద్ర చేస్తారని అన్నారు. మహిళా అధికారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు
లిఫ్ట్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలి..
వనపర్తి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ)/గోపాల్పేట : మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కల్వకుర్తి లిఫ్ట్ కెనాల్ స్టేజ్ 5 కింద చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. ఏదుల, అనంతపూర్ గ్రామాల్లో మంత్రి మంగళవారం పర్యటించి పనులను పరిశీలించి ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కా వాల్సిన భూసేకరణ, పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను రెండు నెలల్లో పూర్తి చేసి నీళ్లు అం దేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేష న్ అధికారులు ఈఈ రవీందర్, డీఈ సత్యనారాయణగౌడ్, జెడ్పీటీసీ బి.భీమయ్య, సర్పంచ్ నాగమణి, ఉప సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ నరేందర్, మాజీ స ర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా డైక్టర్ పరశురాం, సింగిల్‌విండో డైరక్టర్ గోపాల్యాద వ్, నాయకులు వెంకటయ్య, కృపాకర్‌రెడ్డి ఉన్నారు.
కాలుష్య నివారణకు బయో పెట్రోల్..
వనపర్తి రూరల్, ఆగస్టు 23: బయో పెట్రోల్, డీజిల్ ఉతత్తుల వాడకం వల్ల వాతావరణ కాలుష్య నివారణకు ఎంతో మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేం ద్రంలోని నాగవరం, మండలంలోని అంకూర్ గ్రామా ల శివారులో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కా ర్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆగ్రో బయో పెట్రోల్ బంకులను జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మెనేజింగ్ డైరెక్టర్ రాములు, బీపీసీఎల్ ప్రతినిధులతో కలిసి మంత్రి ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగ్రోస్, ప్రైవేట్ భాగస్వాములతో కలిసి బయో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన పెట్రోల్ అం దించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నాగవరం శివారులో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత కమర్షియల్‌గా మారుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా కన్వీనర్ కురుమూర్తియాదవ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాణిక్యం, సింగిల్ విండో చైర్మన్లు వెంకట్రావ్, మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ రంగారెడ్డి, పెట్రోల్ బం కుల ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయరె డ్డి, నరేశ్, సురేశ్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, మంద రాము, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.