నారాయణపేట, ఆగస్టు 23 : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటిపై దాడి చేయడం హేయమై న చర్య అని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. తమపై నిరాధార ఆ రోపణలు చేస్తున్నారని ఇది వరకే ఎమ్మెల్సీ కవిత పేర్కొన డం జరిగిందని, పైగా తప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు ప్రకటించడం జరిగిందన్నారు. ఇటీవల వెలువడి న సర్వే ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో విజయ దుందుభి మోగిస్తున్నట్లు రావడంతో, జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు అడుగడుగునా టీఆర్ఎస్ను దెబ్బ తీయాలనే కుట్రలో భాగంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉద్యమ పార్టీ ఇంటి నుంచి వచ్చిన తమ పార్టీ నాయకులకు ఇలాంటి నిరాధార ఆరోపణలు కొ త్త ఏమి కాదన్నారు. బీజేపీ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇకనైనా మానుకోవాలని తెలిపారు.
ప్రశాంతతను చెదరగొట్టేందుకు కుట్రలు
నారాయణపేట రూరల్, ఆగస్టు 23 : తెలంగాణలో ప్ర శాంతతను చెదరగొట్టేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్త లు కుట్రలు చేస్తున్నారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వే పూరి రాములు అన్నారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో భయాందోళనలు సృ ష్టించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడాన్ని చూసి జీర్ణించుకోలేక తెలంగాణను నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో శాంతి సామరస్యా న్ని కాపాడుకోవడం కోసం యావత్ తెలంగాణ సమాజం సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ గుండా రాజకీయాలు తగవు
ధన్వాడ, ఆగస్టు 23 : బీజేపీ నాయకులు గుండా రాజకీయాలు చేయడం తగదని ధన్వాడ సర్పంచ్ చిట్టెం అమరేందర్‌రెడ్డి ఆన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీ జేపీ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ మంగళవారం మండలకేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయడం హేమమైన చర్యగా పేర్కొన్నారు. 30 నిమిషాలపాటు ధర్నా చేపట్టారు. కార్యక్రమం లో నాయకులు నారాయణస్వామి, చంద్రశేఖర్, కొండారెడ్డి, సత్యనారాయణగౌడ్, పటేల్ నర్సింహులు, మల్లేశ్గౌ డ్, సూరిగౌడ్, శాంతకుమార్, హనుమంతు పాల్గొన్నారు.
దాడి యత్నానికి ఖండన
దామరగిద్ద, ఆగస్టు 23 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిని బాపన్‌పల్లి మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నేత గవినోళ్ల శ్రీనివాస్ ఖండించారు. మండలంలోని బాపన్‌పల్లిలో ఆయన ఇంట్లో మంగళవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అనవసరంగా సీఎం కేసీఆ ర్ కుటుంబ సభ్యులను బద్నామ్ చేయడానికి ఇలాంటి కా ర్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం చేతిలో వి చారణ సంస్థలు కీలుబొమ్మలుగా మారాయన్నారు. ప్ర శ్నించే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించ డం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. కార్యక్రమంలో ఉల్లిగుండం అనంత్‌రెడ్డి, గట్రెడ్డిపల్లి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.