నారాయణపేట, ఆగస్టు 23 : త్వరలో నిర్వహించే గణేశ్ ఉత్సవాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పరిధిలోని ఎస్సైలు కృషి చేయాలని, గణేశ్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించాలని ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు పోలీసు అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులతో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో సిబ్బంది నేరాల సంఖ్యను తగ్గించే విధంగా కృషి చేయాలన్నారు. స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో సరైన దర్యాప్తు చేపడుతూ కోర్టు డ్యూటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కోర్టు ట్ర యల్‌కు ఎప్పటికప్పుడు హాజరవుతూ దోషులకు శిక్షలు పడే విధంగా చూడాలన్నారు. జిల్లాలోని 13 ఫంక్షనల్ వర్టికల్ లో ప్రతిభ కనబర్చిన 33 మంది పో లీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ రి వార్డు ప్రకటించి అభినందించారు. జి ల్లాలో నేరాలు ఎక్కువగా జరిగే ప్రాం తాలను గుర్తించి తదనుగుణంగా పా యింట్ పుస్తకాల పునర్వస్థీకరణ చే యాలన్నారు.
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సి బ్బందితో మర్యాద పూర్వకంగా ఉం డాలని, వారు తీసుకొచ్చే ఫిర్యాదుల ను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తమ తమ గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమవుతూ గ్రామ సమస్యలను తెలుసుకొని పై అధికారులకు సమాచారమిమవ్వాలన్నారు.
జిల్లాలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై త్వరగా స్పందించి, కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు అరవై రోజుల్లో కోర్టుకు సమర్పించాలన్నారు. పాత కేసుల్లో ఎఫ్ఎస్ఎస్ రిపోర్టులు పెండింగ్ ఉండడం కారణంగా కేసులు సత్వరంగా కోర్టుకు సమర్పించకపోవడం వంటి కా రణాలను తగ్గించడానికి దర్యాప్తు అధికారులు ఎఫ్ఎస్ఎల్ రెడ్ హిల్స్ ఆఫీసుకు వెళ్లి అక్కడి అధికారులను సంప్రదించి త్వరగా రిపోర్టులను సేకరించి చార్జిషీట్లు కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు సత్యనారాయణ, వెంకటేశ్వర్రావు, సీఐలు శ్రీకాంత్‌రెడ్డి, రామ్‌లాల్, జనార్దన్, ఆర్ఐలు రాఘవరావు, కృష్ణయ్య, ఎస్సైలు సురే శ్, రాములు, పర్వతాలు, సతీశ్, నరేందర్, అశోక్, విజయ్‌భాస్కర్, విక్రమ్, శ్రీనివాస్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, వసంత, సునీత, ఐటీ కోర్ టీం, డీసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు.