నారాయణపేట టౌన్, ఆగస్టు 23 : ప్రతిఒక్కరూ బంగా రు పతకం సాధించి, జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ని లబెట్టాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి క్రీడాకారులను కోరారు. మెదక్‌లో ఈనెల 24, 25వ తేదీల్లో నిర్వహించే అథ్లెటిక్ పోటీలకు జిల్లా నుంచి ఎంపికైన 30 మంది క్రీడాకారులు మంగళవారం నారాయణపేట నుంచి బయల్దేరి వె ళ్లారు. ఈనెల 17న జిల్లాకేంద్రంలో నిర్వహించిన జూనియ ర్ అండర్ 14, 16, 18, 20 వయస్సు గల 30 మంది క్రీ డాకారులను ఎంపిక చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా సీఐ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లా అథ్లెటిక్ అసోసియషన్ సభ్యులు ఎంతో శ్రద్ధను చూపి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ముత్యంలాంటి క్రీడాకారులను వెలికి తీయడం ఎంతో సం తోషకరమైన విషయమన్నారు. క్రీడాకారులకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్, అథ్లెటిక్ అ సోసియషన్ జనరల్ సెక్రటరీ రమణ, కోశాధికారి అమరేశ్, టీం కోచ్, మేనేజర్ ఇబ్రహీం, పీఈటీలు పర్వీన్బే గం, రాధిక, లక్ష్మి పాల్గొన్నారు.
క్రీడలతో ఆరోగ్యం పదిలం
మక్తల్ టౌన్, ఆగస్టు 23 : క్రీడలతోనే ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండడంతోపా టు చదువులో చురుకుగా రాణించగలుతారని డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా అన్నారు. పట్టణానికి చెందిన 12 మంది క్రీడాకారులను స్థానిక మినీ స్టేడియంలో మంగళవారం శాలువా మెడల్స్‌తో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా ష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీ స్తూ జాతీయస్థాయి క్రీడలకు పంపుతున్న విశ్రాంత పీఈటీ గోపాలంను అభినందించారు. సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు బీహర్ రాష్ట్రం బిడ్డగాయలో జరిగే షూటింగ్ బాల్ పోటీలకు మహేశ్వరి, వైష్ణవి, అఖిల, శివకుమార్, నాగేశ్ ప్రతిభ కనబర్చాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా షూటింగ్ బాల్ అధ్యక్షుడు గోపాలం, పీఈటీలు అమ్రేశ్, దామోదర్, రమేశ్, క్రీడాకారులు పాల్గొన్నారు.