అయిజ, ఆగస్టు 22: తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. సోమవారం ఇన్‌ఫ్లో 30,590, అవుట్‌ఫ్లో 30,190క్యూసెక్కులుగా నమోదైంది. 105.788టీఎంసీల సామర్థ్యానికి 105.788టీఎంసీలు ఉన్నది. 1633అడుగుల నీటిమట్టానికి గానూ, 1633అడుగులు ఉన్నట్లు డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో20,631, అవుట్‌ఫ్లో 20,210క్యూసెక్కులు నమోదైంది. ఆనకట్టలో 9.7అడుగుల నీటిమట్టం ఉన్నది.
జూరాల ప్రాజెక్టుకు..
అమరచింత, ఆగస్టు 22 : జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.10లక్షల క్యూసెక్కులు నమోదు కాగా, 15గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. 1,01,808క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
శ్రీశైలం డ్యాం మూడు గేట్ల ద్వారా..
శ్రీశైలం డ్యాం మూడు గేట్ల ద్వారా 83,400క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. 1,76,232 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదైంది. ఏపీ పవర్‌హౌస్‌లో 31,285, టీఎస్ పవర్‌హౌస్‌లో 31,784క్యూసెక్కులు విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు విడుదల చేశారు. డ్యాం పూర్తి స్థాయి నీటినిల్వ 885అడుగులు కాగా, 884.40 అడుగులు ఉన్నది. 215టీఎంసీల నీటిసామర్థ్యం కాగా, ప్రస్తుతం 211.95 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.