బాలానగర్, ఆగస్టు 22 : మండలంలోని గౌతాపూర్‌లో కోటమైసమ్మ బోనాల ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన బోనాలతో మహిళలు ఊ రేగింపుగా కోటమైసమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, సర్పంచ్ రమేశ్, ఉపసర్పంచ్ కవిత, కోఆప్షన్ సభ్యు డు కల్లెం శ్రీనివాసులు, టీఆర్ఎస్ నాయకులు కృష్ణ, సాయిలు, శేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మండలంలోని వాడ్యాల్, మల్లాపూర్, చిల్వేర్, మున్ననూర్ తదితర గ్రామాల్లో సోమవారం ఈదమ్మ, పోచమ్మ బోనాలపండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బోనాలతో మహిళలు ఊరేగింపుగా ఈదమ్మ, పోచమ్మ ఆలయాలకు చేరుకొని ప్రదక్షిణలు చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. బోనాల ఊరేగింపులో పోతరాజుల విన్యాసం ఆకట్టుకున్నది. చిల్వేర్‌లో ఎడ్లబండ్లతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు మంగ మ్మ, జంగిరెడ్డి, సంయుక్తారాణి, జంగయ్య పాల్గొన్నారు.