ఊట్కూర్, ఆగస్టు 22 : మండలంలోని పులిమామిడి గుట్టపై వెలిసిన రామలింగేశ్వరస్వామి రథోత్సవ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున కొండపై గల కోనేరులో స్నానమాచరించిన భక్తులు భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నా రు. ఆలయ పూజారుల ఆధ్వర్యంలో స్వామికి అభిషేకం, అలంకరణ, మహామంగళహారతి, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం బంతిపూలతో ఆకర్షనీయంగా ముస్తాబు చేసి న రథంలో స్వామిని ప్రతిష్ఠించి ఊరేగించారు. గుట్టపై భక్తు లు పోటీపడి తేరును లాగారు. ఎస్సై రాములు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలకు హాజరైన భక్తులకు అన్ని వసతులను కల్పించా రు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ఆలయ క మిటీ సభ్యులు, వివిధ రాష్ర్టాల భక్తులు, గ్రామస్తులు తది తరులు పాల్గొన్నారు.
కనులపండువగా నిర్వహించుకోవాలి
కోస్గి, ఆగస్టు 22 : పట్టణంలోని కుర్విన శెట్టి జాండ్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే నీలకంఠస్వామి ఉత్సవాలను కనులపండువగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే ప ట్నం నరేందర్రెడ్డి అన్నారు. నీలకంఠస్వామి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దైవచింతన కిలిగి ఉండాలని, రానున్న తరాలకు ఉత్సవాల ప్రాముఖ్యతను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధం గా కుర్విన శెట్టి సమాజ అభివృద్ధ్దికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిప ల్ చైర్పర్సన్ శిరీష, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షు డు రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
పల్లకీ ఊరేగింపు
నారాయణపేట టౌన్, ఆగస్టు 22 : పట్టణంలోని బాహర్పేట్లో సోమవారం కుర్విన శెట్టి జాండ్ర సంఘం ఆధ్వర్యంలో భజన సంకీర్తనలు, నందికోల ఆటలతో నీలకంఠ స్వామి విగ్రహం ఊరేగింపును కనులపండువగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ, పత్రి, పుష్ప, పంచామృతాభిషేకం, బిల్వార్చన, అష్టోత్తర నియమావళి, జల్దిబిందె, నైవేద్యం తదితర ప్ర త్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కుల సంఘం సభ్యు లు, మహిళలు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.