అభివృద్ధిని చూసి ఓర్వలేకే యువతను రెచ్చగొట్టే కుట్రచేస్తున్నారని, ఒకరేమో కులపిచ్చి..ఇంకొకరేమో మత పిచ్చితో రాజకీయం చేస్తున్నారని అలాంటివారిపై అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. టీడీగుట్ట కమ్యూనిటీ హాల్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు సుమారు 300మంది టీఆర్ఎస్లో చేరగా మంత్రి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం క్రిస్టియన్‌పల్లి వద్ద ముడా కార్యాలయాన్ని ప్రారంభించారు. చైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 70ఏండ్లలో ఈ ప్రాంతం అన్యాయానికి గురైందని స్వరాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్/టౌన్, జూలై 30 : రాష్ట్రంలోని ప్ర ధాన ప్రతిపక్ష పార్టీల అధ్యక్షుల్లో ఒకరికేమో కులపిచ్చి ఇంకొకరికేమో మత పిచ్చి ఎక్కినట్టు వ్యవహరిస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. తమ కులానికి మాత్రమే పరిపాలించే అర్హత ఉం దంటూ కాంగ్రెస్ నాయకుడు పేర్కొంటూ పేదలు, బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తున్నారని… కుల, మ తాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడమే కాకుండా ప్రజల మనోభావాలను ప్రతిపక్ష నే తలు దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుస్మితా శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నుంచి ము ఖ్య నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మంది టీ ఆర్ఎస్లో చేరారు. అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష నేత లు యువతను రెచ్చగొట్టి కుట్రలు పన్నుతున్నారని మంత్రి తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతం అభివృద్ధి పట్టని నాయకులు ఇప్పుడు రాజకీయం చేయడానికి వస్తున్నారని, ప్రజలంతా ఇలాంటి నాయకులపై అ ప్రమత్తంగా ఉండాలని కోరారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పనలో మహబూబ్‌నగర్ ఉత్తమ స్థానంలో నిలబడుతుందన్నారు.
రూ.400 కోట్లతో పాఠశాలల అభివృద్ధి
వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణపొందిన రాములు సేవలు వెలకట్టలేనివని మ ంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్, టీడీగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పీఈటీ రాములు ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన సేవలను క్రీడల అభివృద్ధి కోసం వినియోగించుకుంటామని మంత్రి తెలిపారు. టీడీగుట్ట ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం, కిచెన్ షెడ్డును మం త్రి పరిశీలించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్, పీఈటీ సంఘం నేత జగన్మోహన్గౌడ్ ఉన్నారు.
అభివృద్ధికి కంకణబద్ధులమై పనిచేద్దాం..
అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకుగానూ కంకణబద్ధులై పనిచేద్దామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం క్రిస్టియన్‌పల్లి సమీపంలోని ముడా నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి నివాసంలో ముడా చైర్మన్, 15 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముడా కల నెరవేరిందని, ము న్ముందు ఎంతో అద్భుతంగా రూపొందించుకుందామన్నారు. ముడా ఏర్పాటైనా సర్పంచ్, వార్డు మెంబర్ల యథావిధిగా ఉంటారన్నారు. ముడాకు ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ లే అవుట్ల అనుమతికి గతంలో హైదరాబాద్‌కు వెళ్లే వారమని, ఇప్పుడు మన వద్దే పారదర్శకంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ప్లాట్ల డబుల్ రిజిస్ట్రేషన్లు, అక్రమ లేఅవుట్లు జరగకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. టీఆర్ఎస్ నాయకులుగా ప్రజలకు మంచి చేయాలనే తపన ఉండి నూతనంగా ముడా పాలక మండలిలో కొలువుదీరిన ప్రతి ఒ క్కరూ సమర్థవంతంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు ఇంతియాజ్ ఇసాక్, వాల్యానాయక్, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ రహెమాన్, మున్సిపల్ చైర్మ న్లు నర్సింహులు, బస్వరాజ్‌గౌడ్, లక్ష్మీ, వైస్ చైర్మన్ గణేశ్, జిల్లా మత్స్య, పారిశ్రామిక సహకార సంఘం అ ధ్యక్షుడు సత్యనారాయణ, గొర్రెల కాపరుల సంఘం జి ల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, నాయకులు గిరిధ ర్‌రెడ్డి, రామకృష్ణ, వినోద్ పాల్గొన్నారు.
వంటశాలకు భూమిపూజ
మహబూబ్‌నగర్ పట్టణంలోని మోనప్పగుట్టలో విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం మోనేశ్వరస్వామి ఆలయంలో వంటశాల నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రూ.10లక్షల నిధులతో శనివారం భూమిపూజ చేశారు. రూ.24లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, ప్రహరీని ప్రారంభించారు. కార్యక్రమంలో స్వర్ణసహకార సంఘం అధ్యక్షుడు రామాచారి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.