మహబూబ్‌నగర్, జూలై 30 : సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 7, 21 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల గుర్తింపు నిమిత్తం బయోమెట్రిక్ విధానం అమలు చే యనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర వస్తువులకు అనుమతి ఉండదని, చేతులకు మెహందీ ఉం డవద్దని తెలిపారు. రాత పరీక్ష పారదర్శకంగా ఉంటుంద న్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలని, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు, రాతపరీక్ష కోఆర్డినేటర్ నాగరాజు తదితరులు ఉన్నారు.
వాహనాలు సీజ్
సరైన పత్రాలు, నెంబర్‌ప్లేట్ లేని 38 ద్విచక్ర వాహనా లు, నాలుగు ఆటోలను సీజ్ చేసినట్లు డీఎస్పీ మహేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రేంనగర్‌లో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసి కాలనీవాసుల వివరాలను తెలుసుకున్నారు. కొత్త వ్యక్తులకు ఇండ్లను అద్దెకు ఇచ్చే సమయంలో పూర్తి వివరాలను తె లుసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో సీఐలు ప్ర వీణ్‌కుమార్, హనుమప్ప, స్వామి పాల్గొన్నారు.