మహబూబ్నగర్ రూరల్, జూలై 30 : మన్యంకొండ ల క్ష్మీవేంకటేశ్వరస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ శనివారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబసమేతంగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణ మార్మోగింది. అ లాగే స్వామివారికి శేషవాహన సేవను కనులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మధుసూదన్కుమార్, పర్యవేక్షకుడు నిత్యనందాచారి, ఈవో పురందర్కుమార్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
లక్ష్మీనృసింహస్వామికి లక్ష తులసార్చన
జిల్లా కేంద్రంలోని సింహగిరిలో కొలువుదీరిన లక్ష్మీనృసింహస్వామికి శ్రావణ శనివారం సందర్భంగా లక్ష తులసి అర్చన నిర్వహించారు. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
కురుమూర్తిలో బారులుదీరిన భక్తులు
దేవరకద్ర రూరల్, జూలై 30 : చిన్నచింతకుంట మండ లం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కాంచనగుహలో కొ లువుదీరిన కురుమూర్తిస్వామి దర్శనానికి శనివారం భక్తు లు బారులుదీరారు. శ్రావణమాసం తొలి శనివారం సందర్భంగా కురుమూర్తి క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు పెద్దఎత్తున తరలివచ్చారు. కొందరు భక్తులు ప్రత్యేకంగా నైవేద్యం తయారు చేసి స్వామివారికి సమర్పించి మొక్కు లు చెల్లించుకున్నారు.
ఆంజనేయస్వామి ఆలయంలో…
కోస్గి, జూలై 30 : పట్టణంలోని బాహర్పేట ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావ ణ మాసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారి ఉత్సవాలు నిర్వహించారు. కాలనీవాసులు ర్యాలీగా కలశాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చే శా రు. అదేవిధంగా చిందూరం స్వామివారిని అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
మండలకేంద్రంతోపాటు పలు గ్రా మాల ఆలయాల్లో మొదటి శనివారం శ్రావణ మాసం సం దర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలకేంద్రంతోపాటు చేగుంట పార్వతీపరమేశ్వర స్వామి ఆలయం, మూడుమాల వేంకటేశ్వరస్వామి ఆలయం, గుడెబల్లూర్ భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో స్వామి వారికి జలాభిషేకం, రుద్రాభిషేకం, బిల్వార్చన, మహామంగళహారతి, పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా గుడెబల్లూర్ భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని గ్రామంలో పురవీధుల గుండా పల్లకీ సేవలో ఊరేగింపుగా కృష్ణానదిలో జలాలతో అభిషేకం చేసి ఆలయానికి తిరిగి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది భక్తులు దర్శించుకొని స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో భ క్తులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.