అయిజ, జూన్ 12: పల్లె, పట్టణప్రగతి కార్యక్రమం గ్రామా ల్లో, పట్టణాల్లో పండుగలా కొనసాగుతున్నది. పదోరోజు ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా గ్రామా లు, పట్టణాల్లో వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, గ్రామీ ణ క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం తదితర పనులను పరిశీలించా రు. హారితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామ, వార్డుస్థాయి అధికారులతో చర్చించారు. పట్టణంలోని ప్రతి వార్డులో డ్రైనేజీల శుభ్రతతోపాటు గుంతలమయంగా మారిన రోడ్లకు మట్టి తరలిం పు, పాత ఇండ్ల కూల్చివేత, ముళ్లపొదల తొలగింపు, విద్యు త్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మున్సిపాలిటీలోని 20వార్డుల్లో పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డుప్రజల సమన్వయంతో నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సర్పంచుల పర్యవేక్షణలో పల్లెప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పాఠశాలల పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పల్లెప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతన్నాయి. మండలంలోని కోనేరు, క్యాతూరు గ్రామాల్లో కొనసాగుతున్న పనులను ఆదివారం ఎంపీవో చంద్రకళ పర్యవేక్షించారు. అదేవిధంగా నర్సరీలను సందర్శించి బోర్డులు లేని చోట్ల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం పనులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయించారు. డ్రైనేజీల పక్కన చెత్తకుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు ఎత్తివేయాలన్నారు. గ్రామాలను శుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రవితేజ, నరేశ్, సర్పంచులు పాల్గొన్నారు.