ఖిల్లాఘణపురం, జూన్ 12 : పల్లెప్రగతిలో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని జెడ్పీ సీఈవో, మండల ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అల్లమాయిపల్లి, రోడ్డుమీదితండాల్లో ఆయన పర్యటించి పల్లెప్రగతి పనులు, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చేపడుతున్న పల్లె ప్రగతి పనుల్లో భాగంగా ప్రణాళికలు రూపొందించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. పల్లె ప్రగతిలో గుర్తించిన పనులను పూర్తిచేసి వినియోగంలోకి తీసుకోవాలన్నారు. శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, ప్రకృతి వనాలు, నర్సరీలను సక్రమంగా నిర్వర్తించి మొక్కల పెంపకంలో జా గ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది హరితహారం మొక్క లు నాటే కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటేందుకు కృషి చేయాలని, ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సామ్యానాయక్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరుల పాల్గొన్నారు.
గోపాల్పేట, జూన్ 12 : మండలకేంద్రంతోపాటు బుద్ధా రం, పోల్కెపహాడ్, ఏదుట్ల గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను ఆదివారం ఎంపీడీవో కరుణశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామంలో మిగిలిపోయిన పనులు, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. పోల్కెపహాడ్లో తడి, పొడి చెత్త కేంద్రాన్ని పరిశీలించిన ఆమె కేంద్రం వద్ద ప్లాస్టిక్, గాజు, అట్టలు, మెటల్ వేరు చేసి ఉంచాలని ఆదేశించారు. కేంద్రంలో వ్యర్థాల నుంచి త యారు చేసిన ఎరువును అమ్మి వచ్చిన డబ్బును గ్రామ పం చాయతీలో జమ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ బాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి బాలరాజు, రమేశ్‌నాయుడు పాల్గొన్నారు.
ఆత్మకూరు, జూన్ 12 : పట్టణంలోని 9వ వార్డులో టాయిలెట్ కంటైనర్ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్ తెలిపారు. వార్డులో మహిళల ఇబ్బందులను కౌన్సిలర్ రామకృష్ణ ప్రస్తావించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. గతంలో ఉన్నటువంటి సులభ్ కాంప్లెక్ పూర్తిగా శిథిలమైన పరిస్థితుల్లో టాయిలెట్ కంటైనర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. వార్డులోని మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆరుగదులతో కూడిన టాయిలెట్ కంటైనర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తను బహిరంగంగా పారవేయరాదని, చెత్తబండి వాహనాన్ని వినియోగించుకోవాలని ప్రచారం చేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, కమిషనర్ రమేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పాన్‌గల్, జూన్ 12 : మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం సర్పంచ్ శాంతమ్మ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. తండాలోని గిరిజనులు సామూహికంగా పలు వీధులను శుభ్రం చేశారు. తాగునీటి ఓహెర్హెడ్ ట్యాంకుల దగ్గర బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ప్రాథమిక పాఠశాల ఆవరణలో మురుగును తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాంతమ్మ మాట్లాడుతూ ఇంటిపరిసరాల్లో ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, సంపూర్ణ పారిశుధ్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్మద, తండావాసులు బాల్యానాయక్ పాల్గొన్నారు.