గద్వాలటౌన్, జూన్ 12: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించారు. ఉదయం 9:30నుంచి 12గంటల వరకు ఫస్ట్ పేపర్, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5గంటల వరకు సెకండ్ పేపర్ పరీక్ష నిర్వహించారు. రెండు పరీక్షలు కూడా ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల నిర్వహణకుగానూ జిల్లావ్యాప్తంగా ఫస్ట్ పేపర్‌కు 32కేంద్రాలు, సెకండ్ పేపర్ పరీక్ష నిర్వహణకు 22కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ పేపర్‌కు 7,654మంది హాజరు కావాల్సి ఉండగా 7,125మంది అభ్యర్థులు హాజరయ్యారు. 529మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
సెకండ్ పేపర్‌కు 4,920మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 4,626మంది అభ్యర్థులు హాజయ్యారు. 294మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 12,574మంది అభ్యర్థులకు గానూ 11,751మంది అభ్యర్థులు హాజరయ్యారు. 823మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఆర్డీవో రాములు తనిఖీ చేశారు. పరీక్షా పేపర్‌ను, ఓఎంఆర్ షీట్‌ను పరిశీలించారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పిడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్ష అనంతరం పేపర్ల తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అన్ని కేంద్రాల వద్ద వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది.
అయిజ, జూన్ 12 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం టెట్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు ఏపీ రాష్ర్టానికి చెందిన అభ్యర్థులు టెట్ పరీక్షకు హాజరయ్యారు. ఫస్ట్ పేపర్‌కు 934మంది అభ్యర్థులకుగానూ, 864మంది హాజరయ్యారు. 70మంది గైర్హాజరైనట్లు ఎంఈవో నర్సింహులు తెలిపారు. సెకండ్ పేపర్‌కు 22మంది అభ్యర్థులకుగానూ 22మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షకు గర్భిణులు, దివ్యాంగులు, బాలింతలు వచ్చారు. చిన్నారుల ఆలనా పాలనా చూసుకునేందుకు సహాయకులు, భర్తలను వెంటబెట్టుకొచ్చారు.