కొల్లాపూర్, జూన్ 12 : కొల్లాపూర్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పట్టణ ప్రజలకు వివరించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం పట్టణంలోని 9వ వార్డులో ఎమ్మెల్యే బీరం, మున్సిపల్ కమిషనర్ సొం టె రాజయ్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మహిముదాబేగం, కౌన్సిలర్ నయీంతో కలిసి పర్యటించారు. వార్డులో తిరిగి వార్డు ప్రజలందరిని ఆప్యాయంగా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
9వ వార్డులోని వివిధ కాలనీల్లో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకావశాలు ఉన్నాయని ఆ వార్డు ప్రజలు ఎమ్మెల్యే బీరం దృష్టికి తీసుకొచ్చారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్ర జాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వార్డుల్లో సీసీరోడ్లు, డ్రైనేజీ సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే బీరం మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇం టింటికీ మొక్కలు పంపిణీ చేస్తున్నామని, ప్రతిఒక్కరూ మొక్క లు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే బీరం ప్రజలకు పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్‌రె డ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు తాళ్ల పరశురాంగౌడ్, నాయకులు ఖాదర్‌పాషా, గాలియాదవ్, గోపాలమల్లయ్య పాల్గొన్నారు.
అచ్చంపేటటౌన్/రూరల్, జూన్ 12 : పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల అభివృద్ధి జరుగుతుందని అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహగౌడ్ తెలిపారు. ఆదివా రం పట్టణంలోని 9వ వార్డు వినాయక్‌నగర్ కాలనీలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అలాగే అచ్చంపేట మం డలంలోని నడింపల్లి, హాజీపూర్, గ్రామాల్లో అధికారులు పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల ప్రాంతాల్లో సర్పంచులతో కలిసి అధికారులు మొక్కలు నాటారు.
నర్సరీలను సందర్శించి క్రమం తప్పకుండా నీరు పెట్టాలని సూచించారు. హాజీపూర్‌లో రోడ్డు పక్కన ప్రధాన వీధుల గుండా మురుగు నీరు వదిలివేసిన యజమానికి జరిమానా విధించాలని ఇన్చార్జి ఎంపీడీవో మధుసూదన్‌గౌడ్ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్‌ను ఆదేశించారు. అలాగే నడింపల్లి గ్రామంలో అధికారులు పర్యటించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రెండు రోజుల్లో పనులను పూర్తి చేసి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించాలని కార్యదర్శి నిరంజన్ను ఆదేశించారు.
జెడ్పీహెచ్ఎస్ వద్ద మొక్కలను నాటి నీరు పోశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, కౌన్సిలర్లు సుగుణమ్మమంగ్యానాయక్, రమేశ్‌రావు, వార్డు సభ్యులు చందు, భాస్కర్, మున్సిపల్ సిబ్బంది జైపాల్, దీపక్, జాకీర్ హుస్సేన్, ఎంపీవో వెంకటేశ్వర్లు, ఏపీవో పర్వతాలు, అంగన్వాడీ టీచర్లు, ఈసీ భాస్కర్, వీఆర్ఏ సాజిద్, గ్రామ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఉప్పునుంతల, జూన్ 12 : మండలంలో పల్లెప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఎంపీడీవో విజయ్‌భాస్కర్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జరుగుతున్న ము రుగు కాలువల శుభ్రత, బ్లీచింగ్ పౌడర్ పనులను పరిశీలించా రు. అదేవిధంగా నర్సరీ, పల్లెప్రకృతి, డంపింగ్ యార్డులను పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా నీరు పోసి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహబూబ్అలీ, హబీబ్ పాల్గొన్నారు.