కల్వకుర్తి రూరల్, జూన్ 12 : రాష్ట్ర విభజనకు పూర్వం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామాలు, పల్లెలు ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. రాష్ట్ర ఏర్పడిన తర్వాత గ్రామాలకు అత్యధికంగా నిధులు ఇవ్వడంతో పల్లెలకు పునర్జీవం లభించినైట్టెంది. దీనికి తోడు సీఎం కేసీఆర్ గ్రామాలను అభివృద్ధిలో పరుగులు తీయించేందుకుగాను పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా, ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు.
అంతటితో గ్రామాభివృద్ధి నిలిచిపోకుండా గ్రామాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేందుకు గ్రామంలో చెత్తను సేకరించేందుకు, అవసరాలకు నీటిని ట్యాంకర్‌ద్వారా అందించేందుకు ఇతరులపై ఆధారకుండా గ్రామ పంచాయతీ నిధులతో ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ను కొనుగోలు చేయించి గ్రామ పంచాయతీలకు అందించారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు రావడంతో ఒక నవశకం ప్రారంభమైంది.
గ్రామాభివృద్ధికి ట్రాక్టర్లను వినియోగిస్తుండంతో గ్రామాల రూపు రేఖలు మారిపోతున్నాయి. గతంలో వారం పదిరోజులకోసారి చెత్తను తరలించే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే ట్రాక్టర్లు వచ్చా యో నిత్యం చెత్తను ట్రాక్టర్‌ద్వారా డంపింగ్‌యార్డుకు తరలించి గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చే పనిలో నిమగ్నమవుతున్నారు ప్రజాప్రతనిధులు.
గ్రామాలకు ప్రధానంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరా, చెత్త సేకరణ, తరలింపు కార్యక్రమం నిత్యం నిర్వహించుకోవాలి. వీధి దీపాల నిర్వహణ, మంచి నీటి సరఫరా, స్టాండింగ్ కమిటీల ఆధ్వర్యంలో విద్యుత్ దీపాల నిర్వహణ, నీటి సరఫరా నిర్వహణ, ఇతరత్రా కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. గతంలో చెత్త సేకరణ నిత్యం ఇబ్బందికరంగా ఉండేది.
చెత్త బండ్లు సరిగా పనిచేయకపోవడంతో చెత్త ఎక్కడికక్కడే ఉండి దోమలకు నిలయాలుగా మారే వి. ట్రాక్టర్ రావడం..ప్రతి ఇంటికి చెత్త బుట్టలను అందించి ప్రజలకు చెత్తను వేరు చేయ డం పైన అవగాహన కల్పించడంతో ప్రజలు కూడా చెత్తను రోడ్లపైన వేయకుండా ట్రాక్టర్లోనే వేస్తున్నారు. గ్రామ పంచాయతీలు నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లు నిత్యం గ్రామంలోని అన్ని వీధుల నుంచి చెత్తా చెదారాన్ని సేకరించి తరలిస్తుండడంతో గ్రామాలు పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. కల్వకుర్తి మండలంలోని 24గ్రామ పంచాయతీల్లో 24 ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్లు కొనుగోలు చేశారు. వాటితో పాటు గ్రామా న్ని పరిశుభ్రంగా ఉంచేందుకు , గ్రామ అవసరాల నిమిత్తం ట్రాక్టర్లకు డోజర్లను కొనుగోలుచేసి ఏర్పాటుచేశారు.
గ్రామాల్లో హరితహారంతో నాటిన మొక్క లు చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు గ్రా మాల ప్రజలు బాధ్యతగా సంరక్షించుకోవడంతో గ్రామాల్లో ఎటూ చూసిన పచ్చదనమే కనిపిస్తోంది. దీనికి తోడు నూతన గ్రామ పంచాయతీ చట్టం అనేక రకాలైన విధివిధానాలు రూపొందించడంతో గ్రామాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు హరితహారంలో భాగంగా గ్రామాలకు ఇచ్చిన లక్ష్యాలు చేరేందుకు కృషి చేస్తున్నారు.
అంతేగాకుండా నాటిన మొక్కలను మూగజీవాలు మేయకుండా ట్రీగార్డులు ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండడంతో మొక్కలు బాగా పెరిగి గ్రామాలు హరిత గ్రామాలుగా మారుతున్నా యి. ప్రతి గ్రామంలో నాటిన వందశాతం మొక్కల్లో 85శాతం మొక్కలను బతికించాలనే నిబంధన ఉండడంతో ప్రజాప్రతినిధులు అనునిత్యం మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
దీనికితోడు జిల్లాధికారులు, రాష్ట్ర స్థాయి ప్రత్యేకాధికారులు గ్రామాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి ప్రజాప్రతినిధులకు సూచనలు చేస్తుండడంతో మొక్కల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అంటూ వాటిని విధిగా సంరక్షిస్తున్నారు. గ్రామాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పొలాల గట్లు, గుట్టల వెం ట మొక్కలను నాటుతూ హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ గ్రామాలను హరితతోరణంతో అలంకరింపజేస్తూ ప్రభుత్వ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు.