జడ్చర్ల, జూన్ 12 : పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు జెడ్పీ సీఈవో జ్యోతి అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం మండలంలోని ఖానాపూర్, కిష్టారం గ్రామాల్లో పర్యటించి పల్లెప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించారు. అలాగే మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంలో పారిశుధ్య పనులను చేపడుతుండడంతో గ్రా మాలు శుభ్రంగా మారాయని తెలిపారు. పరిసరాల శుభ్రతతో వ్యాధులను అరికట్టవచ్చన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అలాగే హరితహారం కార్యక్రమంలో పెద్దఎత్తున మొక్కలను నాటేందుకు గుంతలను త వ్వించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు యాట అరుణాసత్యనారాయణ, నర్సింహులు, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో జగదీశ్, సత్యనారాయణ, ఉపసర్పంచ్, రంగయ్య, వార్డుసభ్యులు శేఖర్, రాజు, పంచాయతీ కార్యదర్శి లలితకుమారి, మహిళా సంఘం అధ్యక్షురాలు అలివేల పాల్గొన్నారు.
భూత్పూర్, జూన్ 12 : మండలంలోని శేరిపల్లి(హెచ్) గ్రామంలో మండల ప్రత్యేకాధికారి సాయిబాబా పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. గ్రా మంలో తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. అనంతరం నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకంపై పలు సూచనలు చేశారు. నర్సరీ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్ధం చే యాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్ని, సర్పంచ్ విజయకుమా ర్, ఎంపీవో విజయకుమార్, పంచాయతీ కార్యదర్శిగా వెంకటేశ్ పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, జూన్ 12 : మండలంలోని పెద్ద గోప్లాపూర్‌లో గ్రామస్తులతో కలిసి సర్పంచ్ మాధవి శ్రమదానం చేశా రు. కాలనీల్లో పెరిగిన పిచ్చిమొక్కలను తొ లగించడంతోపాటు రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కా ర్యక్రమంతో గ్రామం సుందరంగా మారుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కోయిలకొండ, జూన్ 12 : మండలంలోని కేశ్వాపూర్లో కంపచెట్ల తొలగింపు పనులను చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మొగులయ్య మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవీందర్‌నాయక్, మహేశ్, చందు తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ, జూన్ 12 : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలో శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించారు. అలాగే పారిశుధ్య పనులు చేపట్టారు. పల్లెప్రగతిలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), జూన్ 12 : అడ్డాకుల మండలకేంద్రంతోపాటు, కందూరు, పొన్నకల్, పెద్దమునగాల్చేడ్, శాఖాపూర్, తిమ్మాయిపల్లి తదితర గ్రామా ల్లో పల్లెప్రగతి పనులు ముమ్మరంగా సాగాయి. మండల ప్రత్యేకాధికారి, డీఎఫ్‌వో గంగిరెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో పర్యటించి పల్లెప్రగతి పనులతోపాటు పల్లెప్రకృతి వనాలు, క్రీడాప్రాంగణాలు, పాఠశాలలను పరిశీలించారు. అలాగే మురుగుకాల్వలను శుభ్రం చేయించడంతోపాటు కం పచెట్లను తొలగించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మూసాపేట, జూన్ 12 : మండలంలోని నిజాలాపూర్‌లో మహిళా సంఘాల సభ్యులు శ్రమదానం చేశారు. గ్రామంలోని పురవీధులను చీపుర్లతో ఊడ్చి శుభ్రం చేశారు. అలాగే పిచ్చిమొక్కలు, కంపచెట్లను తొలగించారు. కార్యక్రమంలో సర్పం చ్ గడ్డమీది సత్యమ్మ, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మిడ్జిల్, జూన్ 12 : మండలకేంద్రంతోపాటు బోయిన్పల్లి, కొత్తపల్లి, చిల్వేర్, దోనూర్, వాడ్యాల్, అయ్యవారిపల్లి తదితర గ్రామాల్లో ఎంపీడీవో సాయిలక్ష్మి పర్యటించి పల్లెప్రగతి పనులతోపాటు పల్లెప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రా మాల్లో పల్లెప్రగతి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్ధం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో అనురాధ, సర్పంచులు రాధికారెడ్డి, సంయుక్తారాణి, మంగమ్మ, సునీత, నారాయణరెడ్డి పాల్గొన్నారు.