చారకొండ, జూన్ 11: మండలంలోని కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి ఆదేశించారు. మండలంలోని రహదారిపై శనివారం మొక్కలను పరిశీలించి మాట్లాడా రు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని జూపల్లి నుంచి మర్రిపల్లి వరకు జాతీయ రహదారిపై మూడు వరుసలు పెద్ద మొక్కలు నా టాలని సూచించారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పను లు పూర్తి చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఎంపీడీవో జయసుధ జూపల్లి, తిమ్మాయిపల్లి, సారంబండతండా, గోకా రం, తుర్కలపల్లి, చారకొండలో జాతీయ రహదారికి ఇరువైపులా తీస్తున్న గుంతలను పరిశీలించారు. వారి వెంట ఎంపీవో వెంకటేశ్, ఏపీవో వాసుదేవ్, పంచాయతీ కార్యదర్శులు చెన్నకేశవులు, వినోద్, సైదులు పాల్గొన్నారు.
తిమ్మాజిపేట, జూన్ 11: పల్లెప్రగతి కార్యక్రమంలో మహి ళా సంఘాలు భాగస్వామ్యం కావాలని డీఆర్డీవో నర్సింగరావు కోరారు. మండలంలోని గుమ్మకొండ, తిమ్మాజిపేట, ఇప్పలపల్లి, హనుమాన్తండా, మరికల్ గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఆర్అండ్బీ రోడ్డు వెంట సర్పంచులతో కలిసి మొక్కలు నాటారు. పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాల స్వరూపం మార్చాలన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలన్నారు. గ్రామాల్లో ఎక్కువగా ఉపాధి కూలీలు రావాలన్నారు. ఆయన వెంట సర్పంచులు సత్యంయాదవ్, వేణుగోపాల్గౌడ్, మణెమ్మ, సత్యంనాయక్, హనుమంతుయాదవ్, ఎంపీవో బ్రహ్మచారి ఉన్నారు. అదేవిధంగా మండలంలోని చేగుంట, చంద్రాయన్పల్లి, పోతిరెడ్డిపల్లి, ఆవంచ పాఠశాలల ఆవరణలో శుభ్రం చేశారు. పలు గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
కల్వకుర్తిరూరల్, జూన్ 11: పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలను శుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని ఎంపీడీవో బాలచంద్రసృజన్ సూచించారు. మండలంలోని సుద్దకల్లో శనివారం ఎంపీడీవో గ్రామంలో పర్యటించి మాట్లాడారు. పారిశుధ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాలు శుభ్రంగా ఉండడంతోనే ఆరోగ్యంగా ఉంటామని వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, ఉపసర్పంచ్ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
వెల్దండ , జూన్ 11: గ్రామాలను శుభ్రంగా ఉంచుకొని రోగాల నుంచి కాపాడుకోవాలని నారాయణపూర్ సర్పంచ్ పాత్లావత్ అంజీనాయక్ అన్నారు. మండలంలోని నారాయణపూర్, చెర్కూర్, ఉబ్బలగట్టుతండా తదితర గ్రామా ల్లో శనివారం పల్లెప్రగతి పనులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పరిసరాలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజీనాయక్ మాట్లాడుతూ గ్రామాలను అన్నివిధాలా అభివృద్ధి చేసుకునేందుకే ప్రభుత్వం పల్లెప్రగతికి శ్రీకారం చుట్టిందన్నారు. అందరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
బిజినేపల్లి, జూన్ 11: ప్రతిఒక్కరూ ఇంటి పరిసరాలను శు భ్రంగా ఉంచుకోవాలని పాలెం సర్పంచ్ లావణ్య అన్నారు. మండలంలోని పాలెం గ్రామంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శనివారం శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, చెత్తచెదారాన్ని తొలగించారు. పల్లెప్రగతిలో గ్రామంలో చేపట్టాల్సిన పనులను పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో రాములు, సుజాత, వినీల, సువర్ణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.