మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 11 : వరంగల్ లో జరుగుతున్న జగన్మోహన్రావు స్మారక టీ 20 క్రికెట్ టోర్నీలో శనివారం మహబూబ్‌నగర్ జ ట్టు శుభారంభం చేసింది. మెదక్‌పై 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. డేవిడ్ క్రిపాల్ 20, మహ్మద్ షాదాబ్ 20, గిరిబాబు 16, పవన్ 7 పరుగులు చేశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెదక్ జట్టు 19 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌటైంది. అర్ఫాజ్ అ హ్మద్ 16, అజీజ్ 19, పవనకుమార్ 15, శ్రీధర్ 12 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ జట్టు బౌలర్లలో శ్రీకాంత్‌యాదవ్ 3, మహ్మద్ఖ య్యూం, అనిల్ చెరో 2 వికెట్లు, పవన్, అరుణ్‌కుమార్ ఒక్కో వికెట్ తీశారు. క్రికెట్ సంఘం జి ల్లా కార్యదర్శి రాజశేఖర్, కోచ్ అబ్దుల్లా క్రీడాకారులను అభినందించారు.