నాగర్కర్నూల్, జూన్ 11 : ఆన్లైన్లో పెట్టిన పెట్టుబడికి రెండింతలు సంపాదించాలనుకున్న యూజర్లు నిలువునా మోసపోయిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా.. కొందరు పెట్టుబడిదారులు అధిక మొ త్తంలో డబ్బు సంపాదించాలన్న ఆశతో ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టారు. కొందరైతే అప్పులు చేసి మరీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లా భం పొందాలనుకొన్నారు.
అయితే వారి ఆశలపై మోర్గాన్ ఇండి యా అనే అమెరికాకు చెం దిన ఆన్లైన్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పె ట్టారు. తీరా ఈ కంపెనీ ఆ చూకీ లే కుండాపోయింది. కొందరు ఉన్న డబ్బుతోపాటు నగలు, నట్రా విక్రయించి మరీ పెట్టుబడి పెట్టారు. మొద ట్లో వారు పెట్టిన పెట్టుబడికి లాభాన్ని చూపించడంతో సంబురపడిని యూజర్లు మరింత పెట్టుబడిని రెట్టింపు చేశారు.
దీంతో అ త్యాశతో వేల నుంచి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టారు. తీరా కొన్ని రోజులకు ఆన్లైన్లో సదరు యాప్ కనిపించకుండా పోవడంతో పెట్టుబడి పె ట్టిన వారు బయటకు విషయం చెప్పకుండా ఆం దోళన చెందుతున్నారు. నాగర్కర్నూల్ ప్రాంతానికి చెందిన వారు దాదాపు 200 మంది యూజ ర్లు ఉన్నట్లు సమాచారం. ఈవిషయమై పోలీసులు విచారణ చేపట్టారని తెలిసింది.