నాగర్‌కర్నూల్, జూన్ 11: కామంతో కండ్లు మూసుకుపోయిన ఓ యువకుడు మైనర్ బాలికపై లైంగికదాడికి యత్నించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో శనివారం మధ్యరాత్రి తర్వాత చోటు చేసుకున్నది. సీఐ హనుమంతు కథనం మేరకు.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో తన 12 ఏండ్ల కూతురును వెంటబెట్టుకొని జిల్లా దవాఖానకు వచ్చింది.
అయితే దవాఖానలో నిర్మాణ పనుల్లో భాగంగా పెయింటింగ్ పనులు చేసేందుకు వచ్చిన ఉత్తరప్రదేశ్‌లోని కుషినగరం జిల్లాకు చెందిన ధీరజ్ అనే యువకుడు మధ్యరాత్రి బాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టే ప్రయత్నం చేశాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతుండడంతో గమనించిన సెక్యూరిటీ గార్డ్ అతడిని అడ్డుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు యవకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు వచ్చి ధీరజ్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. దిశ, నిర్భయ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.