నారాయణపేట రూరల్, జూన్ 11 : రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరిగే టెట్ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టెట్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో టెట్ నిర్వహణకుగానూ 42 పరీక్షా కేం ద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్ 1 పరీక్షకు 5,522 మంది అభ్యర్థులకు 25 కేంద్రాలు, ఉదయం 9:30 నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనుంది. పేపర్ 2 పరీక్షకు 3,831 మంది అభ్యర్థులకు 17 కేంద్రాలు, మధ్యా హ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరుగనుంది.
ఒక్కొ పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, నలుగురు హాల్ సూపరింటెండెంట్లను నియమించారు. ఉదయం జరుగనున్న పరీక్షలకు 275 మంది ఇన్విజిలేటర్లు, మధ్యాహ్నం జరుగనున్న పరీక్షలకు 187 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకుగానూ ఆర్డీవో సమావేశ మందిరంలో డీ ఈవో లియాఖత్ అలీ అధ్యక్షతన సీఎస్, డీవోలు, సూపరింటెండెంట్లతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఆయా పరీక్షా కేంద్రాల్లో అధికారులు పరీక్షల గదుల్లో అభ్యర్థులను కేటాయించి నెంబర్లు వేశారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షకు హాజరు కావాలన్నారు. నిమిషం ఆలస్యమై నా పరీక్షకు అనుమతించరు. కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం పరీక్ష ని ర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో, సంతకం ఉండాలి. అలా లేకుంటే గెజిటెడ్ అధికారి ఎండార్స్ చేసిన కాపీ సమర్పిస్తేనే పరీక్షకు అ నుమతించనున్నారు. సూపరింటెండెంట్ స్థాయి అధికారు లు కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనున్నది.
అభ్యర్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే అప్పటికప్పుడే చికిత్స అందించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చికిత్సకు అ వసరమైన సామగ్రి, మందులతో సిద్ధంగా ఉంటారు. వి ద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను సర్కార్ ఆదేశించింది.