మహబూబ్‌నగర్ రూరల్, జూన్ 11 : ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన పట్టణ, పల్లెప్రగతి పనులు శనివారం జోరుగా సాగాయి. గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా పారిశుధ్య పనులను వేగవంతం చేశారు. పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెప్రగతి పనులను పరిశీలించడంతోపాటు చీపుర్లు చేతబట్టి రోడ్లను ఊడ్చారు. మహబూబ్‌నగర్ మండలం కోడూర్లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, సర్పంచ్ శ్రీకాంత్‌గౌడ్, మండల అధికారులు పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. అలాగే కేజీబీవీ నూతన భవనాన్ని పరిశీలించి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేదవతి, ఎంపీవో నరేందర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ నర్సింహులు, ఉపసర్పంచ్ లక్ష్మమ్మ, సింగిల్‌విండో డైరెక్టర్ కృష్ణయ్య, మన్యంకొండ ఆలయ పాలకమండలి సభ్యుడు చిన్నయ్యగౌడ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, హెచ్ఎం రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, జూన్ 11: పల్లెప్రగతి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి పల్లెలను సుందరంగా తీర్చిదిద్దాలని డీపీవో వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని మేడిగడ్డతండా, గంగాధర్‌పల్లి, మోతీగణపూర్, అప్పాజిపల్లి గ్రామాల్లో పర్యటించి పల్లెప్రగతి పనులతోపాటు సెగ్రిగేషన్‌షెడ్డు, క్రిమిటోరియం, హరితహారం మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించడంతోపాటు హరితహారం మొక్కలను నాటేందుకు ఖాళీ స్థలాలను గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జడ్చర్ల, జూన్ 11 : పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జెడ్పీ సీఈవో జ్యోతి అన్నారు. జడ్చర్ల మండలంలోని దేవునిగుట్టతండా, బండమీదిపల్లి గ్రామాల్లో పర్యటించి పల్లెప్రగతి పనులతోపాటు పల్లెప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ పల్లెప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములై పల్లెలను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలను నా టేందుకు గుంతలను తీయించాలని, క్రీడాప్రాంగణాల నిర్మా ణ పనులను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్, కార్యదర్శికి సూచించారు. అదేవిధంగా అన్ని గ్రామపంచాయతీల్లో పల్లెప్రగతి పనులను ముమ్మరంగా నిర్వహించారు. కార్యక్రమం లో సర్పంచులు రాములునాయక్, ప్రణీల్‌చందర్, రాజేశ్వర్‌రెడ్డి, గంగ్యానాయక్, రవినాయక్, రవీందర్‌రెడ్డి, కుర్వపల్లి శ్రీనివాసులు, పాండు, నర్సింహులు, సువర్ణ పాల్గొన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పట్టణప్రగతి కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఇండ్ల మధ్యను న్న కంపచెట్లను తొలగించి పారిశుధ్య పనులు చేపట్టారు. అలాగే హరితహారం మొక్కలను నాటేందుకు గుంతలను తవ్వించారు. 24వ వార్డులో ఎల్లమ్మగుడికి వెళ్లేందుకు మట్టిరోడ్డు నిర్మాణ పనులను కౌన్సిలర్ ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే భగీరథ పైపులైన్ పనులను పూర్తి చేయించా రు. వార్డులో ఖాళీ స్థలాలను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చే యించనున్నట్లు కమిషనర్ మహమూద్ షేక్ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, సంతోష్‌నాయక్, శంకర్, వెంకటేశ్‌గౌడ్, రాధాకృష్ణ, గోపాల్‌గౌడ్, ఉదయ్‌గౌడ్, వార్డు అధికారి రమేశ్ ఉన్నారు.
భూత్పూర్, జూన్ 11 : మండలంలోని శేరిపల్లి, మద్దిగట్ల గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్ని, ప్రత్యేకాధికారి సాయిబాబా, సర్పంచులు ప్రియాంకారెడ్డి, శేఖర్, ఎంపీవో విజయకుమార్, పంచాయతీ కార్యదర్శులు సునీల్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్, జూన్ 11 : మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో పల్లెప్రగతి పనులను ముమ్మరం చేశారు. మండలకేంద్రంతోపాటు పలు గ్రామాలు, తండాల్లో డ్రైనేజీలను శుభ్రం చేయించడంతోపాటు రోడ్లను ఊడ్చి చెత్తాచెదారం తొలగించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచు లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గండీడ్, జూన్ 11 : మండలంలోని గొల్లగడ్డ గ్రామంలో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి పరిశీలించారు. పల్లెప్రగతిలో భాగంగా పాడుబడిన బావిని పూడ్చివేయించినట్లు తెలిపారు. అలాగే పిచ్చిమొక్కలను తొలగించి మురుగుకాల్వలను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్‌రెడ్డి, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్, జూన్ 11 : మండలంలోని గాధిర్యాల్లో సర్పంచ్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పల్లెప్రగతి పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించారు. గ్రామ పరిశుభ్రతకు అందరూ సహకరించాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఎంపీవో శంకర్‌నాయక్, పంచాయతీ కార్యదర్శి హాజి తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, జూన్ 11 : అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచాలని డీసీవో, మండల ప్రత్యేకాధికారి సుధాకర్ అన్నారు. మండలంలోని దొడ్డిపల్లిలో పర్యటించి పల్లెప్రగతి పనులతోపాటు వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీవో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు. అలాగే కారుకొండలో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో శ్రీలత పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో భద్రూనాయక్, ఏపీవో జ్యోతి, సర్పంచులు లక్ష్మమ్మ, బాలరాజు, నాయకుడు గవిండ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.