కొల్లాపూర్, జూన్ 11: దళితబంధు పథకంపై దేశంలో ఏ ముఖ్యమంత్రికి తట్టని ఆలోచన సీఎం కేసీఆర్‌కు తట్టిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దళితబంధు లబ్ధిదారులు ఇక యజమానులని స్పష్టం చేశారు. కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కమిటీ నూతన పాలకవర్గం చైర్మన్ కిషన్‌నాయక్, వైస్ చైర్మన్ సోమనాథ్నాయక్తోపాటు డైరెక్టర్లతో మార్కెట్ కార్యదర్శి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని మాజీ జెడ్పీటీసీ జంబులయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతితో కలిసి మంత్రి హాజరయ్యారు. నూతన పాలక వర్గం సభ్యులను పూలమాలతో సన్మానించారు. అనంతరం దళితబంధు పథకం కింద 25మంది లబ్ధిదారులకు మంత్రి టాక్టర్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశయాల కనుగుణంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై ఇతర రాష్ర్టాల్లో చర్చ నడుస్తుందని కష్టపడి ప్రయోజకులు కావాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని బీజేపీ అడ్డుపడ్డుతుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు.
కోనసీమగా మారనున్న కొల్లాపూర్ మార్కెట్ కమిటీకి ఇద్దరు గిరిజన నాయకుల సారథ్యం వహించి కార్యకలాపాలు నిర్వహించబోతున్నారన్నారు. సమాజంలో అణగారిన దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పెద్ద మనుస్సుతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి జీవితాల్లో వెలుగునింపుతున్నారని నాగర్‌కర్నూల్ జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి పేర్కొన్నారు.
అనంతరం 152మంది బాధితులకు రూ.92,75,400 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను, కొల్లాపూర్,పెంట్లవెల్లి మండలాలకు చెందిన 97మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పట్టణంలోని మాధవస్వామి ఆలయం ఆవరణలో 48 షాపింగ్ దుకాణాలకు వారు భూమిపూజ చేశారు.
కార్యక్రమంలో ఆర్డీవో హనుమానాయక్, తాసిల్దార్ రమేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీచారిచంద్రశేఖరాచారి, వైస్ చైర్పర్సన్ మహెముదాబేగంఖాదర్పాషా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్‌నాయక్, దూరెడ్డిరఘువర్ధన్రెడ్డి, తాళ్ల పరశురాంగౌడ్, గాలియాదవ్, మూలేకేశవులు, చింతకుంటరాఘవేందర్, పార్టీ మండలాల అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్, గణేశ్‌రావు, రామచందర్‌యాదవ్, సింగిల్‌విండో చైర్మన్లు శ్రీనువాసులు, కృష్ణయ్య, జెడ్పీటీసీలు గౌరమ్మచంద్రయ్యయాదవ్, వెంకట్రావమ్మ, మాధూరి, ఎంపీపీలు భోజ్యానాయక్, కమలేశ్వర్‌రావు, సోమేశ్వరమ్మ, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.