అచ్చంపేట, జూన్ 9 : వానకాలం సాగు ప్రారంభమైం ది. అచ్చంపేట డివిజన్లో వారం రోజుల కింద కురిసిన వ ర్షాలకు రైతులు విత్తనాల సాగు ప్రారంభించారు. కొందరు రైతులు వ్యవసాయ పరికరాల మరమ్మతులు చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు. మ రి కొందరు పొలాలు దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విధంగా రైతులు ఎవరికి వారు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, లింగా ల, అచ్చంపేట, బల్మూర్ మండలాల్లో విత్తనాల సాగు ప్రా రంభించారు. మరో వర్షం వస్తే విస్తృతంగా విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.
ఫర్టిలైజర్ దుకాణాల నుంచి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఉంచారు. కొందరు రైతులు బోర్ల కింద విత్తనాలు వేస్తున్నారు. కోటి ఆశలతో వానకాలం సాగులో నిమగ్నమయ్యారు. వానకాలం రా వడంతో చాలా మంది రైతులు, కూలీలు ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు తిరిగివచ్చారు. రైతులు పెద్దసంఖ్య లో సాగుకు సిద్ధంకాగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
రైతులు, కూలీలు వలసలు వెళ్లకుండా స్థానికంగానే ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎక్కడా బీడు పొలాలు లేకుండా పెద్దసంఖ్యలో వ్యవసాయం చేస్తున్నారు. కొందరు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వర్షాలు అనుకూలంగా కురిసే అవకాశం ఉంటుందని రైతులు అశాభావంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు పత్తి, జొన్న విత్తనాలు వేశారు. మరికొందరు రైతులు అదును కోసం ఎదురుచూస్తూ వానకాలం సాగులో నిమగ్నమయ్యారు.