భూత్పూర్, ఆగస్టు 25: యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. గురువారం మండలంలోని పెద్దతండా, కర్వెన గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఎమ్మెల్యే ఆల ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రీడలు ఆడటం వల్ల శారీరకంగా దృఢంగా తయారవుతారనే ఉద్దేశంతో క్రీడా ప్రాంగణాలను నిర్మించినట్లు తెలిపారు. అదేవిధంగా మత్స్యకారులకు, యాదవులకు, వాల్మీకులకు కమ్యూనిటీ భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే రూ.5లక్షల చొప్పున మూడు ప్రొసీడింగ్‌లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వాలీబాల్ ఆడి యువతను ఉత్సాహ పరిచారు.
కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీడీవో మున్ని, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, ఎంపీవో విజయకుమార్, ఏపీవో విమల, సర్పంచ్ లాలీ, ఎంపీటీసీ నిర్మలామాధవరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఎజాజ్, గఫార్, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సాయిలు, మురళీధర్‌గౌడ్, సత్యనారాయణ, అశోక్‌గౌడ్, రాజారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 25: అడ్డాకుల మండలంగుడిబండకు చెందిన సాయిలు అనారోగ్యంతో బాధపడు తూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. సాయిలుకు మెరుగైన వైద్యం అందించాలని పరిస్థితిని జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ఆల సీఎం సహాయనిధికి రెఫర్ చేసి రూ.2.50 లక్షలు మంజూ రు చేయించారు. గురువారం ఎమ్మెల్యే ఆల రాజశేఖర్ కుటుంబసభ్యులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ అందజేశారు.