నిర్మల్ టౌన్, ఆగస్టు 21: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ సంస్కరణల పేరిట ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా డిస్కంలకు విద్యుత్ సరఫరాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సర్కారు 24 గంటల ఉచిత కరెంట్‌ను అమలు చేస్తున్న నేపథ్యంలో, కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రతిబంధకంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర రైతాంగానికి 2018 జనవరి నుంచి 24 గంటల ఉచిత కరెంటును ప్రభుత్వం అమ లు చేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,51,288 వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లుండగా, ఈ రంగానికి ప్రతిరోజు 4.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతున్నది. ప్రభుత్వం రైతులకు అం దించే ఉచిత కరెంట్‌పై ప్రతినెలా విద్యుత్ సంస్థలకు యూనిట్ కాస్ట్ కింద ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్లను చేపట్టి రైతులు, పారిశ్రామికరంగానికి సరఫరా చేస్తోంది.
ఈ కరెంట్‌ను డిస్కంల ద్వారా డిస్ట్రిబ్యూ ట్ చేస్తున్నది. కాగా, బకాయిలున్న డిస్కంలకు సరఫరా నిలిపివేయాలని తాజాగా ఆదేశించడంతో ఆ ప్రభావం పడనుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ రైతాంగానికి కేంద్రం అమలు చేసిన ఎనర్జీ ఎక్చేంజీల నిబంధన కారణంగా విద్యుత్ సరఫరా తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కోతలు విధించే అవకాశం ఉంటుందని రైతాంగం ఆం దోళన చెందుతున్నది. ప్రస్తుతం రైతులు వరి, పత్తి, మక్క, తదితర పంటలకు నీటి వినియోగం ప్రారంభమైన తరుణంలో డిస్కంలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. అన్ని జిల్లాల అధికారులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. జిల్లాలో సోలార్ పవర్, నీటి విద్యుత్‌ను ఎక్కువగా వినియోగించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగంపై ప్రజ ల్లో పెద్ద ఎత్తున అవగాహన పెంచి పొదుపు పాటించేలా చూడాలని నిర్ణయించారు. మిగులు విద్యుత్‌ను వ్యవసాయరంగానికి మళ్లించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పంపు సెట్ల ఆధారంగా ఏ జిల్లాలో ఎంత విద్యుత్ అవసరమో లెక్కలు వేసుకొని అందించే విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అవసరమైతే పగటివేళల్లో కరెంటు కోతలు కూడా విధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇటు రైతులకు ఇబ్బం ది కలిగిస్తుండగా, అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. కేంద్రం మాత్రం మంచిగ బతుకుతున్నోళ్లమీద కుట్రలు చేసుడే పనిగా పెట్టుకున్నది. కరెంట్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు విధి స్తూ మాలాంటి రైతులకు అన్యాయం చేస్తోంది. ఇప్పటికే ఉచిత పథకాలు ఎం దుకని కుళ్లు పెట్టుకున్నది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంట్‌పై ఆంక్షలు విధించడం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. నాకు రెండుబోర్లు ఉండగా.. ఐదెకరాల వరకు పంట సాగు చేసుకుంటున్న. బోర్లకు నీటివాడకానికి వ్యవసాయ పంపు సెట్లే ప్రధానం. ఇప్పుడు కేంద్రం విధించిన ఆంక్షల వల్ల కరెంటు కోత వస్తే పంట పండే అవకాశం లేదు.
-గణేశ్, రైతు, ఓలా