స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన వనమహోత్సవం ఉత్సాహంగా సాగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని గురిజాల రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జైపూర్ మండలం ఇందారం చౌరస్తాలో కలెక్టర్ భారతీ హోళికేరి, సీసీసీ ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో సింగరేణి డైరెక్టర్ బలరాం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాల ఆవరణలో కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మంచిర్యాల (నమస్తే తెలంగాణ)/ఆసిఫాబాద్, ఆగస్టు 21 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీలతో పాటు ఊరూరా మొక్కలు నాటి స్ఫూర్తినింపారు. బెల్లంపల్లి మండలం గురిజాల రైతు వేదిక ముందు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జైపూర్ మండలం ఇందారం చౌరస్తాలో కలెక్టర్ భారతీ హోళికేరి, ఇందారం ఓపెన్ కాస్ట్ బండ్‌పై సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ మొక్కలు నాటారు.
మందమర్రి మండలం బొక్కల గుట్ట గ్రామపంచాయతీలోని కోటేశ్వర్రావుపల్లి, మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్‌నగర్‌లో జడ్పీటీసీ రవి, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజుతో కలిసి అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మొక్కలు నాటారు. మంచిర్యాల జిల్లాకేంద్రంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణతో కలిసి, హాజీపూర్ మండలకేంద్రంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మొక్కలు నాటారు.
చెన్నూర్ నియోజకవర్గకేంద్రంలో ఆస్నాద్ రోడ్‌లోని అభయాంజనేయ పంచముఖీ హనుమాన్ ఆలయ ప్రాంతంలో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన గిల్డా, జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో జడ్పీ సీఈవో, కవ్వాల్ అటవీప్రాంతంలో ఎఫ్‌డీవో మొక్కలు నాటారు. సీసీసీ ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఏసీ హాలును సింగరేణి డైరెక్టర్ బలరాం ప్రారంభించి, మొక్కలు నాటారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాల ఆవరణలో కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.