ఊట్కూర్, ఆగస్టు 21 : భక్తులకు కొంగు బంగారమై దీ వించే పులిమామిడి రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వారం రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆ దివారం స్థానిక సంపంగోళ్ల బావి నుంచి గుట్టపై వెలిసిన రామలింగేశ్వరస్వామి ఆలయం వరకు జల్దిబిందె సేవ ఊరేగింపు నిర్వహించారు.
స్వామి వారికి పూలు, పండ్లు, నైవే ద్యం సమర్పించి అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ శివారులో గల గుట్టపై భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పవ(చి న్న తేరు) లాగారు. యువకులు నందికోళ, అడుగుల భజనలు వేసి చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భ క్తులకు నిర్వాహకులు అన్నదానం చే శారు. సోమవారం అగ్నిగుండ మహోత్సవం, రథోత్సవం ఉంటుందని ఆ లయ కమిటీ స భ్యులు విజయకుమార్, నవీన్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో స ర్పంచ్ సూరయ్యగౌడ్, వైస్‌ఎంపీపీ ఎ ల్లాగౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు, వీరశైవ సంఘం సభ్యులు, భక్తులు తదిత రులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, ఆగస్టు 21 : పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా స మీపంలో ఉన్న హంద్రికే జగలింగేశ్వరస్వామి ఉత్సవాలు ఆదివారం వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి అభిషేకం, మహామంగళహారతి, నైవేద్యం త దితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం నిర్వహించిన యు వకుల రెట్టపట్ల కార్యక్రమం ఆకట్టుకుంది. పలువురు యువకులు ఉత్సాహంగా రెట్టపట్ల పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సుధాకర్, అర్చకులు, భ క్తులు తదితరులు పాల్గొన్నారు.