శ్రీశైలం, ఆగస్టు 11 : శ్రీశైలం జలాశయానికి పెద్ద మొత్తంలో వరద వస్తుంది. సుమారు 4 లక్షలకుపైగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో గురువారం ఉదయం నుంచి ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల ఎత్తుకు తెరచి నీటిని విడుదల చేశారు. 4,30,107 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా స్పిల్‌వే నుంచి 3,76,670, కుడి, ఎడుమ విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి 58,584 క్యూసెక్కులను దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ 884.40 అడుగులకు చేరింది. సామర్థ్యం 215.807 టీఏంసీలు ఉండగా 211.95 టీఎంసీలకు చేరాయి.
అయిజ, ఆగస్టు 11 : కర్ణాటకలోని టీబీ జలాశయం 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,62,522 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో కూడా 1,62,522 క్యూసె క్కులుగా నమోదైనట్లు డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. సామర్థ్యం 105.788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 100.640 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 1633 అడుగులకుగానూ 1631.71 అడుగులకు చేరిందని పేర్కొన్నారు. అలాగే ఆర్డీఎస్కు ఇన్‌ఫ్లో 1,40,200 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,39,800 క్యూసెక్కులుగా నమోదైంది. ఆయకట్టుకు 400 క్యూసెక్కులు చేరుతున్నట్లు ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం 14.1 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు ఏ శ్రీనివాస్ పేర్కొన్నారు.
రాజోళి, ఆగస్టు 11 : సుంకేశుల జలాశయానికి ఎగువ నుంచి వరద వచ్చి చేరుతున్నది. 1,78,454 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 27 గేట్లు తెరిచి న అధికారులు 1,76,359 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 2,095 క్యూసెక్కులు వదిలినట్లు జేఈ రాజు తెలిపారు.
అమరచింత/దేవరకద్ర రూరల్, ఆగస్టు 11 : జూరాల ప్రాజెక్టుకు గంటగంటకూ ఇన్‌ఫ్లో పెరుగు తున్నది. గురువారం రాత్రి వరకు 2.47 లక్షల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో 38 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యు దుతృత్తికి 29 వేల క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ఎడుమ కాల్వకు 640 క్యూసెక్కులు, కుడి కాల్వకు 578 క్యూసె క్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం 2,22,634 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా నమోదైంది. అలాగే కోయిల్‌సాగర్ ఒక గేటును తెరిచారు.