నారాయణపేట/రూరల్/ ఊట్కూర్/ కోస్గి/ కృష్ణ/ మరికల్/ దామరగిద్ద/ మాగనూరు/నర్వ, ఆగస్టు 11: స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, అందులో భాగంగా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి తెలిపారు. వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి నిర్వహించిన ఫ్రీడం రన్‌ను ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
జాతీయ జెండాలను చేత పట్టుకొని స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను నినాదాలు చేస్తూ వీరసావర్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తాల మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ఫ్రీడమ్ రన్ కొనసాగింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, ఆర్డీవో రాంచందర్, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
కోస్గి పట్టణంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో సీఐ జనార్దన్, ఎస్సై జగదీశ్వర్ ఫ్రీడమ్ రన్ చేపట్టారు. ఊట్కూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. విద్యర్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎస్సై రాములు, ఎంపీడీవో కాళప్ప, ఎంపీటీసీ హనుమంతు పాల్గొన్నారు. కృష్ణ మండల కేంద్రంలో గురువారం ఎంపీడీవో శ్రీనివాసులు, ఎస్సై విజయ్ భాస్కర్, ధన్వాడలో సర్పంచ్ చిట్టెం అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్‌ను ప్రారంభించారు.
మరికల్లో ఫ్రీడమ్ రన్‌ను జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖాహన్మిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ రాంలాల్, ఎస్సై అశోక్ బాబు, సర్పంచ్ గోవర్ధన్, యూత్ అధ్యక్షుడు రాజేశ్ పాల్గొన్నారు. దామరగిద్ద మండల కేంద్రంలో ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, ఎంపీవో రామన్న, కార్యదర్శి రాజయ్యగౌడ్, రాఘవేందర్‌గౌడ్, హెచ్ఎస్ ఎన్రెడ్డి పాల్గొన్నారు. మాగనూర్‌లో సర్పంచ్ రాజు, ఎంపీపీ శ్యామలమ్మ, జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఏపీవో సత్యప్రకాశ్, ఏపీఎం రామలింగం ఆధ్వర్యంలో 2కే రన్‌ను నిర్వహించారు.
నర్వ మండల కేంద్రంలో పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, వైస్ ఎంపీపీ వీణవతి, ఎస్సై విక్రమ్, మండల ప్రత్యేకాధికారి శివప్రసాద్‌రెడ్డి, ఎంపీడీవో రమేశ్‌కుమార్ పాల్గొన్నారు. నారాయణపేట మండలంలోని సింగారం గ్రామంలో ఫ్రీడం రన్ నిర్వహించారు. నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధరామప్ప, అశోక్, కార్యదర్శి రాకేశ్ పాల్గొన్నారు. భగీరథ సంపు వద్ద మొక్కలతో 75అంకెలను రాసి జాతీయపతాకాన్ని ఎగురవేశారు.
మక్తల్ టౌన్, ఆగస్టు 11: దేశంలో స్వార్థ రాజకీయాల కోసం స్వాతంత్య్రం తెచ్చిన మహనీయులను మరిచి కేంద్రం ఇస్టానుసారంగా వేడుకలను జరుపుకొంటుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవం వేడుకల సందర్భంగా మక్తల్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన 2కే ఫ్రీడమ్ రన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలకు మువ్వన్నెల జెండాను కూడా ప్రజలకు అందించలేని దుస్థితికి దిగజారిందన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో వైభవంగా వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఫ్రీడమ్ రన్ సందర్భంగా కళాశాల మైదానంలో మువ్వన్నెల రంగుల బెలూన్స్‌ను వదిలారు. మక్తల్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, గురుకుల కళాశాలలో వజ్రోత్సవాలకు ఎమ్మెల్యే చిట్టెం ముఖ్య అథితిగా హాజరై జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జాన్ సుధాకర్, సీఐ సీతయ్య, ఎస్సై పర్వతాలు, మున్సిపల్ చైర్పర్సన్ పావని, వైస్ చైర్మన్ అఖిల రాజశేఖర్‌రెడ్డి, పురపాలక కమిషనర్ నర్సింహులు, ఎంఈవో లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ కౌసల్యా, డీటీ కాలప్ప, మహిపాల్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, విశ్రాంత పీఈటీ గోపాలం, ఈశ్వర్ యాదవ్ పాల్గొన్నారు.