భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్లో యువకులు, అధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. జాతీయ జెండాలు చేతపట్టి వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటూ నినదిస్తూ ముందుకుసాగారు. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని ఫ్రీడమ్ రన్‌కు విశేష స్పందన వచ్చింది. దారిపొడవునా జాతీయ పతాకాలు రెపరెపలాడాయి.
ప్రత్యేకంగా తయారు చేసిన టీ షర్టులను ధరించి రన్లో పాల్గొన్నారు. 2కే రన్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జాతీయ పతాకాన్ని చేతబట్టి జెడ్పీ మైదానం నుంచి డైట్ కళాశాల మైదానం వరకు సుమారు ఐదు వేల మందితో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎకోపార్కు వరకు రన్నింగ్ చేశారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్దన్‌రెడ్డి, గద్వాలలో జెడ్పీ చైర్పర్సన్ సరిత కార్యక్రమాన్ని ప్రారంభించారు.