జడ్చర్లటౌన్/బాలానగర్, ఆగస్టు 11 : స్వాతంత్య్ర సమరయోధులను అందరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ ఔన్నత్యానికి పాటుపడాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగం గా జడ్చర్ల మార్కెట్‌యార్డు నుంచి చేపట్టిన ఫ్రీడమ్ రన్‌ను గురువారం ప్రారంభించారు. అక్కడి నుంచి విద్యార్థులు, యువతతో కలిసి రన్లో పాల్గొన్నారు. అనంతరం మున్సిపాలిటీలోని 12వ వార్డులో రూ.20లక్షలతో నిర్మించిన ఫ్రీడమ్ పార్కును ఎమ్మెల్యే ప్రారంభించారు.
పార్కులో ఏర్పాటు చేసిన 75 సంవత్సరాల ఆకృతి అందరినీ ఆకట్టుకున్నది. అదేవిధంగా బాలానగర్ ఏకలవ్య గురుకులం నుంచి ఫీడమ్ 2కే రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములై దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాద య్య, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్‌చైర్‌పర్సన్ సారిక, కౌన్సిలర్ రఘురాంగౌడ్, ఎంఈవో మంజులాదేవి, మున్సిపల్ కమిషనర్ మహమూద్‌షేక్, అర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ శివకాంత్, సీఐ రమేశ్‌బాబుతోపాటు టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ వెంకటాచారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనాయక్, యూత్వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ మంజూనాయక్, ఎంపీటీసీ లింగూనాయక్, సర్పంచులు శంకర్, రవినాయక్, నాగేందర్‌నాయక్, బాలయ్య, తాసిల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ వెంకట్‌రెడ్డి, సీఐ జములప్ప, ఎస్సై జయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.