మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 11 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. రన్‌ను పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ ప్రా రంభించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పవన్‌కుమార్, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, కిశోర్, బాలరాజుగౌడ్, నూర్జన్హాన్బేగం, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ప్రసన్నకుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, అర్జున్‌కుమార్, గాలెన్న పాల్గొన్నారు.
పాలమూరు, ఆగస్టు 11 : మహబూబ్‌నగర్ మండలంలోని కోడూర్, అల్లీపూర్, దివిటిపల్లి గ్రామాల్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ ఫ్రీడ మ్ రన్ నిర్వహించారు. అలాగే ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జి ల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, సర్పంచులు శ్రీకాంత్‌గౌడ్, ఆంజనేయులు, జరీనాబేగం తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ, ఆగస్టు 11 : స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి భువనేశ్వరి ఆలయం వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. అలాగే ఇండ్లపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమం లో ఎంపీపీ బాలరాజు, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఏపీఎం సుదర్శన్, ఈవోపీఆర్డీ వెంకట్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, వైస్‌చైర్మన్ కృష్ణయ్యగౌడ్, ముడా డైరెక్టర్ బాలయ్య, సర్పంచులు రేవతి, వెంక న్న, లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, ఎస్సై తిరుపాజీ, ఉపసర్పంచ్ గంగాపురి, లక్ష్మ య్య, జంబులయ్య, సత్యం, రాఘవులు పాల్గొన్నారు.
కోయిలకొండ, ఆగస్టు 11 : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయం నుంచి ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి ఫ్రీడమ్ రన్‌ను ప్రారంభించగా, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం చౌరస్తాలో జాతీయ పతాకంతో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ య్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ మల్లయ్య, ఎంపీటీసీ ఆంజనేయులు, తాసిల్దార్ ప్రేంరాజ్, ఎంపీడీవో జయరాం, ఎస్సై శ్రీనయ్య, ఏవో రాంపాల్, డాక్టర్లు నరేశ్, చంద్రశేఖర్, హెచ్ఎం వెంకట్‌జీ పాల్గొన్నారు.
గండీడ్, ఆగస్టు 11 : మండలంలోని వెన్నాచేడ్, గండీడ్, పెద్దవార్వల్, కొంరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ జ్యోతి, ఎంపీవో శంకర్‌నాయక్, ఏపీవో శంకర్‌నాయక్, గండీడ్ సర్పంచ్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్, ఆగస్టు 11 : వజ్రోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో ఫ్రీడమ్న్ నిర్వహించారు. కార్యక్రమం లో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, తాసిల్దార్లు జ్యోతి, ఆంజనేయులు, ఎంపీవో శంకర్‌నాయక్, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, కోఆప్షన్ సభ్యుడు సలీం, సర్పంచులు పార్వతమ్మ, జితేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఖాజాహసిబుద్దీన్, శ్రీనివాస్, డిప్యూటీ తాసిల్దార్ శేఖర్, ఆర్ఐలు రాఘవేందర్, యాదయ్య, ఎస్సై రవిప్రకాశ్, ఏపీఎం హరిశ్చంద్రుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భిక్షపతి, రాజ్‌కుమార్‌రెడ్డి, అశోక్‌గౌడ్, రాములు, కిష్టయ్య పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 11 : మండలకేంద్రంలో చేపట్టిన ఫ్రీడమ్న్న్రు ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, ఎస్సై విజయకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు ఫ్రీడమ్ రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మూసాపేట మండలం సంకలమద్ది ఆదర్శ మహిళాకే్ంర దం నుంచి చేపట్టిన ఫ్రీడమ్న్న్రు ఎస్సై నరేశ్ ప్రారంభించారు. మండలకేంద్రంలోని బస్టాండ్ వరకు ఫ్రీడమ్న్ కొనసాగింది. కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప, ఎంపీవో సరోజ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, ఆగస్టు 11 : మండలంలోని నేరళ్లపల్లి, వాయిల్‌కుంటతండా, చెన్నంగులగడ్డతండా, ఊటకుంటతండా, కేతిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ప్రతి ఇంటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రజలు తమ ఇండ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచులు గోపీనాయక్, ఖలీల్, లలితామంజూనాయక్, రవినాయక్, రాంరెడ్డి, ఎంపీటీసీ లింగూనాయక్, పంచాయతీ కార్యదర్శి నరేశ్ పాల్గొన్నారు.
మిడ్జిల్, ఆగస్టు 11 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మండల రెవెన్యూ కార్యాలయం నుంచి చేపట్టిన ఫ్రీడమ్ రన్‌ను తాసిల్దార్ శ్రీనివాసులు ప్రారంభించారు. వాడ్యాల్ స్టేజీవరకు ఫ్రీడమ్ రన్ కొనసాగింది. అలాగే మిడ్జిల్, మల్లాపూర్, చిల్వేర్, కొత్తపల్లి, బోయిన్పల్లి, లింబ్యాతండా తదితర గ్రామాల్లో జాతీయ జెండాలను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఎస్సై రాంలాల్‌నాయక్, ఎంపీడీవో సా యిలక్ష్మి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జంగిరెడ్డి, సర్పంచులు రాధికారెడ్డి, నారాయణరెడ్డి, సంయుక్తారాణి, మేఘానాయక్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు సుదర్శన్, గౌస్, రాజిరెడ్డి, పాండు, నారాయణరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బాల య్య, రాజేశ్వర్, భీంరాజు, బంగారు, పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్, దివ్య, శ్రీనివాసులు, సాయన్న ఉన్నారు.
రాజాపూర్, ఆగస్టు 11 : భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని మండలకేంద్రంలో చేపట్టిన ఫ్రీడమ్ రన్‌ను డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సుశీల ప్రా రంభించారు. రన్లో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు ఉ త్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎస్సై శ్రీనివాస్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, ఆగస్టు 11 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు చైతన్యచౌహాన్, సతీశ్, ఉమాశంకర్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, నందకిశోర్‌గౌడ్, సాజితాఇఫ్తేకార్ పాల్గొన్నారు.
నవాబ్‌పేట, ఆగస్టు 11 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ నుంచి చేపట్టిన ఫ్రీడమ్ రన్ ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ చందర్‌నాయక్, తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, ఎస్సై శ్రీకాంత్, ఎంపీవో భద్రూనాయక్, సర్పంచులు గోపాల్‌గౌడ్, సత్యం, సురేందర్, వెంకటేశ్, నాయకులు ప్రతాప్, రంగారావు, నర్సింహాచారి, బంగ్లారవి, శ్రీను, నర్సింహులు పాల్గొన్నారు.