కొల్లాపూర్, ఆగస్టు 5 : సమాజంలో అట్టడుగులో ఉండి అణగారిపోయిన దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతీష్టాత్మకంగా తీసుకొని దళితబంధు పథకాన్ని అమలుకు శ్రీకా రం చుట్టారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. కొల్లాపూర్‌లోని అంబేద్కర్‌కాలనీకి చెందిన బండి శ్రీనివాసులుకు దళితబంధు పథకం కింద మంజూరైన ఇండికా కారును నా గర్‌కర్నూల్ జిల్లా కేంద్రం షోరూంలో శుక్రవారం లబ్ధిదారుడికి ఎమ్మెల్యే తాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్యే బీరం మాట్లాడుతూ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ద్వారా యూనిట్లు మంజూరైన లబ్ధిదారులు సమాజంలో ఆర్థికంగా నిలదొక్కుకొని ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ లక్ష్యాన్ని సక్రమంగా నిర్వర్తించుకొని ఇతరులకు తమ యూనిట్ల ద్వారా ఉపాధి చూపాలని, అప్పుడే సార్థకత ఏర్పడుతుందన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జాఫర్, పెద్దకొత్తపల్లి మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్రావు, దళితబంధు పథకం తాలూకా కోఆర్డినేటర్ కా టం జంబులయ్య, టీఆర్ఎస్ నాయకులు దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి, రామచందర్‌యాదవ్, చంద్రయ్యయాదవ్, బొరెల్లి మహేశ్, సాయిరాంయాదవ్, పాల్గొన్నారు.
కొల్లాపూర్, ఆగస్టు 5 : అనారోగ్యంతో మృతి చెందిన రెండు బాధిత కుటుంబాలను శుక్రవారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. మండలంలోని సింగవట్నంలో అనారోగ్యంతో మృతి చెందిన మంచాల సత్యనారాయణ (58) పార్థివదేహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే బీరం నివాళులర్పించారు. బాధితకుటుంబాన్ని ఓదార్చారు.
అనంతరం పట్టణంలోని 4వ వార్డులో ఇటీవల మృతి చెందిన మల్రెడ్డి అంబన్న ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించా రు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయ న వెంట మాచినేనిపల్లి సింగిల్‌విండో చైర్మన్ చింతకుంట శ్రీ నివాసులు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు జింకల కిరణ్‌కుమా ర్, రాఘవేందర్, గొల్లశ్రీను, కౌన్సిలర్ పస్పుల కృష్ణ, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు పరశురాంగౌడ్ ఉన్నారు.
కొల్లాపూర్‌రూరల్, ఆగస్టు 5 : కొల్లాపూర్ మండలం సింగోటం సర్పంచ్ మండ్ల కృష్ణయ్య (లాలి)ను శుక్రవారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. సర్పంచ్ కృష్ణయ్య అనారోగ్య కారణంగా కొన్ని రోజులుగా హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొంది ఆరోగ్యం మెరుగుపడగానే స్వగ్రామానికి తిరిగివచ్చాడు. సర్పంచ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసి ఎమ్మెల్యే స్వయంగా అతడి ఇంటికి వెళ్లి క్షేమ సమాచారాన్ని తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.